Site icon Prime9

Ntr : రూ. 100 వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ.. బీజేపీ టార్గెట్ అదేనా?

government goint to print ntr picture in 100 rupees silver coin

government goint to print ntr picture in 100 rupees silver coin

Ntr : నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.

అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

కాగా ఈ వంద రూపాయాల నాణెన్ని వెండితో తయారు చేయనున్నారు.

 

ఈ మేరకు ఈ నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపించారు. ఈ నాణెంపై సలహలు, సూచనలు తెలియజేయాలని కోరారు. త్వరలోనే మే 28వ తేదీన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ వెండి నాణెన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అయితే ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

1964 నుంచి చారిత్రక ఘటనలు, ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేయడం ప్రారంభించారు. తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు. ఆ తర్వాత మాజీ ప్రధాని వాజ్ పేయ్ చిత్రంతో కూడా నాణెం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎన్టీఆర్ కాయిన్ ని కూడా రిలీజ్ చేయబోతుండడం పట్ల రాజకీయ కోణం ఏమైనా ఉందా? అని అంతా ఆలోచిస్తున్నారు.

(Ntr) సంచలనంగా అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీ..

ఇటీవలే అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేంద్రంలో అత్యంత కీలక వ్యక్తి అయిన అమిత్ షా రెండు గంటలపాటు జూనియర్ ఎన్టీఆర్‌తో చర్చలు జరపటం, భోజనం కూడా చేయటం సర్వత్రా చర్చ జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో పొత్తులో ఉండగా, అమిత్ షా వంటి కీలక నేత జనసేనానికి సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్‌ను మాత్రమే ఆహ్వనించి చర్చించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వీరి కలయిక ఆసక్తిగా మారింది.

అయితే  ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో.. అందుకు ఎన్టీఆర్ ని అభినందించడానికి ఆ సమావేశం జరిగిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చాలా సార్లు రామారావుకు భారత ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో సైతం తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించడం.. చేసి ఉండవచ్చని రాజకేయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో అని..

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version