Site icon Prime9

Director Rajamouli : మేరా భారత్ మహాన్.. మా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం : రాజమౌళి

director-rajamouli speech in hca awards event goes viral

director-rajamouli speech in hca awards event goes viral

Director Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు. ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది.

అంతే కాకుండా.. ఇప్పుడు ఏకంగా ఐదు కేటగిరీల్లో అంతర్జాతీయ అవార్డులను గెలుపొందింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలలో ఈ సినిమా సత్తా చాటింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్ సీఏ అవార్డులలో బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, స్పాట్ లైట్ విభాగాల్లో గెలుపొందింది. హాలీవుడ్ టాప్ స్టార్ నటించిన విదేశీ చిత్రాలను వెనక్కు నెట్టి అంతర్జాతీయ వేదికపై అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను అభినందిస్తూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

ఇది ఇండియన్ సినిమా విజయం – (Director Rajamouli) రాజమౌళి

అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డు ప్రకటించిన హెచ్సీఏ సభ్యులకు ధన్యవాదాలు. ఇన్ని అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డులతో మేము ఇంకా పైకి ఎదగగలం అని భావిస్తున్నాము. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ స్టంట్స్‌ అవార్డుని, బెస్ట్ యాక్షన్ ఫిలిం అవార్డుని అందించిన హెచ్సీఏ కు ధన్యవాదాలు. ఈ సినిమాకి స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ ని కంపోజ్ చేసిన జూజీతో పాటు మా కోసం భారతదేశం వచ్చి పనిచేసిన మరికొంతమంది స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ అందరికి కృతజ్ఞతలు. వాళ్ళు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాని నేను మొత్తం 320 రోజులు షూట్ చేస్తే అందులో చాలా వరకు స్టంట్స్‌ సీన్స్ కోసమే అయ్యాయి.

ఈ సినిమాలో రెండు, మూడు సీన్స్ లో మాత్రమే డూప్స్ వాడాము. మిగిలిన అన్ని సీన్స్ లోనూ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్వయంగా చేశారు. నా తరపున అవార్డ్స్ ఇచ్చే వాళ్లందరికీ ఒక విన్నపం. స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ లేకపోతే ఇంత మంచి యాక్షన్ సినిమాలు రావు. కాబట్టి వారికి కూడా బెస్ట్ స్టంట్స్‌ కొరియోగ్రాఫర్ గా ఒక కేటగిరి ఉండాలని భావిస్తున్నాను. నా సినిమా స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని సినిమాల స్టంట్స్‌ కొరియోగ్రాఫర్స్ కి చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే మంచి మంచి యాక్షన్స్ సీన్స్ రావు. మమ్మల్ని అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్యూ. అలాగే ఈ అవార్డులు నాకు మాత్రమే కాదు మా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం. మా ఇండియన్ కథలకు దక్కిన గౌరవం. థ్యాంక్యూ. మేరా భారత్ మహాన్ అని అన్నారు.

 

 

ఈ అవార్డులను డైరెక్టర్ రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి చరణ్ మాట్లాడుతూ.. ‘హాయ్ గయ్స్, నేను స్టేజ్ మీదకు వస్తానని ఊహించలేదు. నా డైరెక్టర్ తోడుగా రమ్మని పిలిస్తేనే స్టేజ్ పైకి వచ్చాను. అవార్డు అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నా. మరిన్ని మంచి చిత్రాలతో అందరినీ అలరించేందుకు కృషి చేస్తాం. థాంక్యూ’ అని చెప్పారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version