Site icon Prime9

Dhanush-Aishwarya Rajinikanth: ఇన్వెస్టిచర్ వేడుకలో కలిసిన ధనుష్ మరియు ఐశ్వర్య

Dhanush-Aishwarya Rajinikanth: హీరో ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరూ విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఈ జంట 18 సంవత్సరాల కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి, సోషల్ మీడియాలో వారు యక్టీవ్ గా లేరు. విడిపోయిన తరువాత వీరిద్దరూ ప్రజల చూపుకు కూడా దూరంగా ఉన్నారు. తనకంటే వయసులో చిన్నవాడైన ధనుష్‌ను ప్రేమించి ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ధనుష్ తమిళ తెరపై హీరోగా నిలదొక్కుకునే సమయంలో ఐశ్వర్య హీరో ధనుష్ కు అండగా నిలిచారు. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలోని మంచి పేరు గల కుటుంబాలకు చెందినవారే. ఐశ్వర్య రజనీకాంత్ పెద్ద కూతురు నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్. పెళ్ళి సమయంలో ధనుష్ వయసు 23ఏళ్లు. ధనుష్ కన్నా ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. అప్పటిలోనే వీరిద్దర మధ్య వయసు కారణంగా వీళ్ళ జోడీ సెట్ అవ్వలేదనే విమర్శలు బాగా వచ్చాయి. ఐతే వయసు అనే భేదం మా మధ్య ఎప్పుడూ రాలేదని ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ గతంలో చెప్పారు. ఎవరు ఊహించని విధంగా ఈ ఇద్దరు విడిపోయారు. ఈ క్రమంలో ధనుష్, ఐశ్వర్య తరచూ కలుసుకుంటున్నారనే వార్తలు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, మా మధ్య ఎలాంటి సంబంధం లేదని ధనుష్ ఎప్పటి నుంచో ఈ విషయాన్ని ఖండిస్తునే ఉన్నారు.

ఈ మధ్య ధనుష్ తన ట్విట్టర్ ఐశ్వర్య ట్వీటుకు రిప్లై ఇచ్చారు. మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు అని ధనుష్ ట్వీట్ చేశారు. ఐశ్వర్య కూడా ధనుష్ ట్వీటుకు రిప్లై ఇచ్చారు. ఐశ్వర్య థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా అప్పుడు ట్వీట్స్ చేసుకున్న తరువాత వీరిద్దరూ ఒకరికొకరు కాంటాక్టులో ఉన్నారని అప్పట్లో ట్వీట్లు బాగా వైరల్‏గా అయ్యాయి.

ధనుష్ మరియు ఐశ్వర్య ఆగష్టు 22 న వారి పెద్ద కుమారుడు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఇన్వెస్టిచర్ వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వచ్చారు. ధనుష్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో, ఐశ్వర్య తన పనుల్లో బిజిగా ఉంది. యధావిధిగా సినిమాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించింది. వారు విడిపోయిన తరువాత దాదాపు ఏడు నెలల తర్వాత, ఈ జంట ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ ఈవెంట్ విచ్చేసిన ధనుష్ మరియు ఐశ్వర్య మరియు వారి ఇద్దరు పిల్లలతో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్లూ షర్ట్‌లో ఇద్దరూ జంటగా కనిపించారు.ఈ కార్యక్రమానికి మలయాళ గాయకుడు విజయ్ యేసుదాస్ కూడా హాజరయ్యారు.

హీరో ధనుష్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టింస్తున్న ‘తిచిత్రంబలం’ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ధనుష్ కెరీయర్లో సూపర్ హిట్టుగా నిలిచింది. ధనుష్ తరువాత సినిమాలు నానే వరువేన్ మరియు వాతి వరుసగా సెప్టెంబర్ మరియు డిసెంబర్‌లలో విడుదల కానున్నాయి. మరోవైపు ఐశ్వర్య వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఐపోయింది.

Exit mobile version