Site icon Prime9

BRS meeting in Khammam: సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న.. 2024 లో మోదీకిి గొప్ప బహుమతి ఇద్దాం- కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal

BRS meeting in Khammam: తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని.. ఆ పథకం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీ, పంజాజ్ లోనూ ఈ కార్యక్రమం చేపడుతామని ఆయన అన్నారు.

తెలంగాణలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలపై కూడా కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. దేశం అభివృద్ధి చెందడం ఎలా.. రైతులకు, కార్మికులకు ఏం చేయాలనే అంశాలపై ముఖ్యనేతలందరం కలిసి చర్చంచామన్నారు.

కేరళలో అద్భుతంగా ఉన్న విద్యాసంస్థలు.. దేశమంతటా ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు.

గవర్నర్ వ్యవస్థను బీజేపీ భ్రష్టుపట్టించిదని మండిపడ్డారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో దేశప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

అభివృద్ధి పనులకు అడ్డు వేయడమే గవర్నర్ల పనా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

తమకు పడని వారిపై ఐటీ, ఈడీలను ప్రయోగించి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

ఆ దేశాలు ప్రగతి సాధిస్తున్నాయ్ మనం మాత్రం..

మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న సింగపూర్, జపాన్, జర్మనీలు ప్రగతి సాధిస్తుంటే.. మన దేశం ఎందుకు వెనుకబడి పోయిందన్నారు.

ప్రజల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. అంతా కలిసి 2024 లో మోదీకి గొప్ప బహుమతి ఇద్దామని తెలిపారు.

కేసీఆర్ ఢిల్లీలో పర్యటించి.. అక్కడ అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి.. తెలంగాణలో బస్తీ దవాఖానాలు ప్రారంభించారని గుర్తు చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లు పరిశీలించి అభినందించారన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) ఖమ్మం(BRS meeting in Khammam)లో నిర్వహించిన భారీ సభ జనసంద్రం అయింది.

బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీ,తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం నగరం కిటకిటలాడింది.

బీఆర్ఎస్ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజలకు వరాల జల్లు కురిపించారు.

జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు .. ఒక్కొ గ్రామ పంచాయితీకి రూ. 10 లక్షలు కేటాయించారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఇవి మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ. 30 కోట్లు చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేశారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version