Nani In Suma Adda Show : నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు. ‘నేను లోకల్’ సినిమా తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
దసరా చిత్రం మార్చి 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. నాని తన కెరీర్ లో తొలిసారి ఇలాంటి ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. దసరా చిత్రంపై నాని బోలెడు ఆశలే ఉన్నాయి. ప్రస్తుతం నాని ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా నాని.. సుమ హోస్ట్ గ్గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోకి తన చిత్ర యూనిట్ తో కలసి హాజరయ్యాడు. నానితో పాటు నటుడు దీక్షిత్ శెట్టి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ హాజరయ్యారు.
Navarathri begins 🙂
On the last day #Dasara will arrive 🔥#DasaraOnMarch30th pic.twitter.com/P5syVIqFHK— Nani (@NameisNani) March 21, 2023
సక్సెస్ ఫుల్ అయిన ఫ్యామిలీ లోని అందరూ సక్సెస్ కాలేదు – నాని (Nani In Suma Adda Show)
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చూసుకుంటే.. ఈ షోలో మొదట నాని చేత సుమ ఫన్నీ గేమ్స్ ఆడించింది. ఆ తర్వాత నాని, దసరా టీం నుంచి ఫన్ రాబడుతూనే వారిని ఇరకాటంలో ప్రేట్టే ప్రశ్నలు కూడా అడిగింది. చివర్లో క్వశ్చన్ రౌండ్ లో భాగంగా సుమ.. ‘తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు కాంపిటీషన్ వచ్చే హీరో లేడు’ అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ అవుననే బోర్డు చూపించిన నాని.. ‘సక్సెస్ ఫుల్ అయిన ఫ్యామిలీలోని అందరూ సక్సెస్ కాలేదు’ అని మిగతా హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఇది ప్రమోషన్ తో పాటు ఫన్ కోసమే చేసినట్లు కనిపిస్తుంది. ఫుల్ ఎపిసోడ్ వస్తేగానీ అసలు విషయం తెలియదు.
అలానే దసరా సినిమాను తాను అనుకున్నంత బాగా తీయలేదని దర్శకుడు శ్రీకాంత్ గురించి నాని అన్నాడు. నాని ఈ ప్రశ్నకు ఎలాంటి వివరణ ఇచ్చాడో పూర్తిగా తెలియాలంటే 25వ తేదీన సుమ అడ్డా షో చూసే తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.