Site icon Prime9

Director Rajamouli : రాజమౌళి చేతులు కట్టుకుని మరీ ఎందుకు వింటున్నారు? జేమ్స్ కామెరూన్ ఏం చెబుతున్నారు?

conversation between james cameron and director rajamouli video goes viral

conversation between james cameron and director rajamouli video goes viral

Director Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచంలో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో భాగంగా జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. ఈ మేరకు ట్విట్టర్ లో గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. మీతో 10 నిముషాలు మాట్లాడుతూ మా సినిమా గురించి అనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నాను. నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ అని పోస్ట్ చేశారు.‘నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు జక్కన్న.

ఆర్ఆర్ఆర్ (RRR) గురించి జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే..?

ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా తాజాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం జేమ్స్ కామెరూన్, రాజమౌళితో  మాట్లాడిన వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. మీరు మాత్రమే ఊహించగలరు. అది వైల్డ్ గా ఉండాలి. సినిమా మేకింగ్ ప్రక్రియ వెనుక జరిగే ప్రతిదీ. ఎందుకంటే మీరు చేసిన అన్ని పని మరియు మీ అభిరుచి మీదే ఉండాలి. ప్రేక్షకుడు సినిమాని ఆస్వాదించగలగాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.   

జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవరసం లేదు.

ప్రపంచ సినిమా రంగం లోనే బెస్ట్ ఫిల్మ్ మేకర్ లలో ఒకరిగా ఎంతో గుర్తింపు పొందారు జేమ్స్ కామెరూన్.

టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో జేమ్స్ దిట్ట అని చెప్పాలి.

టైటానిక్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన జెమ్స్.. అవతార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

అలాగే ఇప్పుడు అవతార్ 2తో మరో సెన్సేషనల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇటీవలే రాజమౌళి ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పిల్ బర్గ్ ని కూడా కలిశారు.

ఆయన్ని కలిసిన రాజమౌళి ఆ ఫోటోని షేర్ చేస్తూ నా దేవుడ్ని కలిశారని పోస్ట్ చేశారు.

స్టీవెన్ స్పిల్ బర్గ్ కి ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు సాంగ్ నచ్చాయని చెప్పారన్నారు. దీంతో వీరిద్దరి ఫోటో వైరల్ గా మారింది.

కీరవాణి పోస్ట్.. సముద్రమంత ఆనందం అంటూ
అలాగే కీరవాణి కూడా జేమ్స్ కామెరూన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ఆర్ఆర్ఆర్ సినిమాని చూసి నా మ్యూజిక్ కూడా నచ్చిందని చెప్పారు. సముద్రమంత ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు. ఇదే ఊపులో ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతం అందరి ఆకాంక్ష ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలవాలని ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version