Site icon Prime9

Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” మెగా మాస్ ఈవెంట్ కి లైన్ క్లియర్… ప్లేస్ ఫిక్స్ !

chiranjeevi waltair veeerayya pre release event place fixed

chiranjeevi waltair veeerayya pre release event place fixed

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా “వాల్తేరు వీరయ్య“. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కేఎస్ రవీంద్ర ( బాబీ ) దరకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిరంజీవి, రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ ప్రమోషన్‌ జోరుగా సాగుతోంది. ఈ మేరకు నిన్న రాత్రి రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ తో ట్రైలర్ దూసుకుపోతుంది. ముఖ్యంగా ‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ను చూసి.. వాడు నా ఎర, నువ్వే నా సొర.. రికార్డులో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అనే డైలాగులు ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.

కాగా ఈరోజు ( 8 వ తేదీన ) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించారు. ముందుగా విశాఖ బీచ్‌ రోడ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఏపీలో జీవో 1 కారణంగా బీచ్‌ రోడ్‌ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో సభ వేదికను ఏయూ కాలేజీ గ్రౌండ్స్‌కి షిఫ్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈవెంట్ కి సమయం దగ్గర పడుతున్న వేదిక ఎక్కడో ఫిక్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు లోనయ్యారు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదంటూ, వైజాగ్ లో పర్మిషన్ క్యాన్సిల్ చేసింది అనే వార్తలు కూడా వచ్చాయి.

ఏయూ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..

అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా వేదికను ఫిక్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు (ఆదివారం) విశాఖ ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్ గా ప్లాన్ చేసింది మూవీ యూనిట్. అయితే సమయం తక్కువ ఉండడంతో చకచకా ఏర్పాట్లు చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ఏయూలో మెగా అభిమానుల సందడి మొదలైంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ విశాఖ రానున్నారు. ప్రస్తుతం ఈవెంట్ కి చకచక ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి…

Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?

Gudivada Amarnath: బాలయ్య బాబు కాదు తాత- గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు

Waltair Veerayya Trailer : మాస్ కి బొడ్డు కోసి పేరు పెట్టిందే ఆయన… మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ రిలీజ్

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version