Brahmanandam : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో వివాహం జరిగింది. అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబు, శ్రీకాంత్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి వారిని ఆశీర్వదించారు.