Site icon Prime9

Boys came to friend’s wedding by wearing sarees: ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకుని వచ్చిన అబ్బాయిలు..

sarees

sarees

Trending News: సాధారణంగా వివాహానికి హాజరయ్యేవారు ఎలాంటి బట్టలు వేసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలు చీర కట్టుకుంటారు, అబ్బాయిలు తమ డ్రెస్ కోడ్‌లో వస్తారు. అయితే  కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఇద్దరు అబ్బాయిలు తమ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి చీరలు కట్టుకుని వచ్చారు. అమెరికాలోని మిచిగాన్‌లో తమ స్నేహితుడి పెళ్లిలో ఇద్దరు అబ్బాయిలు చీరలు కట్టుకున్న వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఇద్దరు మగవాళ్లకు ఒకావిడ చీర కడుతూ ఉంటుంది. ఆ చీరల్లో ఇద్దరూ వీధుల్లో నడుచుకుంటూ వెడుతుంటారు. వరుడు వధువు కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే తన ఇద్దరు స్నేహితులూ చీరకట్టులో చూసి అవాక్కయ్యాడు. కాసేపటికి తేరుకొని ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకొన్నాడు. ఆ తర్వాత ముగ్గురూ నవ్వు కుంటారు ఈ తతంగం అంతా వధువు చాటుగా చూస్తుంది. ఈ వీడియోని ఇప్పటివరకు 40వేల మంది లైక్ చేశారు.

Exit mobile version