Site icon Prime9

Bellamkonda Sai Srinivas : ఆ విషయంలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ “జయ జానకి నాయక” మూవీ..

bellamkonda srinivas jaya janaki nayaka movie got 700 million views on youtube

bellamkonda srinivas jaya janaki nayaka movie got 700 million views on youtube

Bellamkonda Sai Srinivas : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అల్లుడు శీను సినిమాలో తన నటనతో ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కినప్పటికీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ మధ్య ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

అయితే ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా కూడా సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి హిందీలో మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. అతను ఏ సినిమా రిలీజ్ చేసిన అది హిందీలో డబ్ అవ్వాల్సిందే.. దానికి లక్షల్లో వ్యూస్ రావాల్సిందే.. అన్నట్టు ట్రెండ్ సృష్టిస్తున్నాయి.

కాగా 2017 లో తెలుగులో రిలీజ్ అయిన జయ జానకి నాయక సినిమా బాగానే ఆడింది, ఇదే మూవీని హిందీలో డబ్ చేసి పెన్ మూవీస్ యుట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. 2019 ఫిబ్రవరి 8న హిందీలో జయ జానకి నాయక ‘ఖూన్కార్’ అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో 700 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఏ బాషలో అయినా ఒక సినిమా 700 మిలియన్ వ్యూస్ రాబట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం అని చెప్పాలి. యుట్యూబ్ లో రిపీట్ వ్యూస్ రాబడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి మాత్రం ఏకంగా హిందీ బాక్సాఫీస్ నే టార్గెట్ చేశాడు. తనకి తెలుగు డెబ్యు ఇచ్చిన వీవీ వినాయక్ దర్శకత్వంలో, ప్రభాస్-రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాని సాయి శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మే 12న ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అలానే మరోవైపు స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఒక చిత్రం చేస్తున్నాడు.  ‘స్టువర్టుపురం దొంగ’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కెరీర్‌లో ఇప్పటి వరకు లేనంత కొత్తగా బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కాగా ఇదే స్టోరీతో మాస్ మహరాజ్ రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు.

Exit mobile version