AP DGP : అది ఒక రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ అకౌంట్ .. బాధ్యత గల పదవిని నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాల్సిన వృత్తిలో ఉన్న పోలీస్ బాస్ ఆయన.
అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శంగా ఉండేలా నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక ఆయన సోషల్ మీడియా ఖాతా కూడా అంతే సామాజిక స్పృహతో మెయింటైన్ చేయాలి.
కానీ ఒక అధికారిక డీజీపీ ట్విట్టర్ ఖాతాలో అశ్లీలతగా ఉన్న పోస్ట్ ని లైక్ చేయడం అనేది ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయం.
సదరు గౌరవ ప్రదమైన పోస్ట్ లో ఉండి ఒక అశ్లీలతగా ఉండే పోస్ట్ ని లైక్ చేయడం అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్దం కావట్లేదు.
ఆ హోదాలో ఉన్న వ్యక్తి అటువంటి పోస్ట్ ని లైక్ చేశారనే ఒక వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
వైరల్ గా ఏపీ డీజీపీ అకౌంట్ వీడియో..
అ వీడియో ఒక స్క్రీన్ రికార్డర్ ద్వారా చేసినట్లు కనబడుతుంది.
కాగా ఆ లైక్ చేసింది .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అకౌంట్ నుంచి..
ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ట్విట్టర్ అకౌంట్ అని.
ఈ అకౌంట్ ని ఏపీ పోలీస్ అఫిషియల్ అకౌంట్ కూడా ఫాలో అవుతున్నట్లు సదరు వీడియో చూస్తే అర్దం అవుతుంది.
అయితే ఆ వీడియోలో ఒక అశ్లీల పోస్ట్ ని ఈ అకౌంట్ నుంచి లైక్ చేసినట్లు కనబడుతుంది.
is this the twitter official handle of DGP, Andhra Pradesh @dgpapofficial ?
Even @APPOLICE100 following this account? @FactCheckAPGov @AndhraPradeshCM @ysjagan ??#AndhraPradesh pic.twitter.com/8UObM4HqWz— The Protagonist (@KalyanForever_) January 20, 2023
ప్రస్తుతం ఆ అకౌంట్ లో అటువంటి లైక్ కనిపించకపోయినప్పటికి .. అంతకు ముందు ఉన్నట్లు ప్రొఫైల్ పిక్, ఆ అకౌంట్ లైక్ చేసిన ఏపీ పోలీస్ ఇప్పుడు ఫాలోవర్స్ లో లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
ఆ పోస్ట్ ని అక్టోబర్ 2022 లో లైక్ చేసినట్లు ఆ వీడియో కనబడుతుంది.
తాజాగా ఈ వీడియో వెలుగు లోకి రావడంతో నెటిజన్లు ఈ విద్వ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాగా ఈ వీడియో గురించి ఏపీ ఫాక్ట్ చెక్, ఏపీ పోలీస్ స్పందించి .. ఆ వీడియో రియలా ? ఫేక్ ఆ ?? అని వెల్లడించాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఈ మేరకు ఏపీ పోలీస్, సీఎం జగన్, ఏపీ ఫాక్ట్ చెక్ లను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.
సంబంధిత అధికారులు ఈ విషయంపై త్వరగా స్పందించాలని కోరుతున్నారు.
గౌతం సవాంగ్ డీజీపీగా జూన్ 1వ తేదీ 2019 నుంచి ఫిబ్రవరి 15 2022 వరకు పని చేశారు. ప్రస్తుతం డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/