Site icon Prime9

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం ఇచ్చిన దుబాయ్ ప్రభుత్వం..

allu arjun post aboutgetting golden visa from dubai

allu arjun post aboutgetting golden visa from dubai

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప – 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్.

తనదైన శైలిలో రాణిస్తూ సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదిగాడు బన్నీ.

ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు.

అయితే సోషల్ మీడియా లోనూ టాక్టివ్ గా ఉండే బన్నీ .. ఫోటోస్, వీడియో లు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటాడు.

కాగా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

(Allu Arjun) అల్లు అర్జున్ పోస్ట్ లో ఏముందంటే..

ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి.. ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు. దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్ట్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

 

గోల్డెన్ వీసా వల్ల ఉపయోగాలు..

సాధారణంగా దుబాయ్ గోల్డెన్ వీసా దుబాయ్ కి రెగ్యులర్ గా వెళ్లే వాళ్లకి, అక్కడ బిజినెస్ చేసే వారికి, పలువురు సెలబ్రిటీలకు దుబాయ్ ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర ఎమిరేట్స్‌లో పదేళ్ల వరకు నివసించవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లు నూరు శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. గోల్డెన్ వీసా 5 లేదా పదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ టైంలో ఎన్ని సార్లైనా దుబాయ్ కి వెళ్లి రావొచ్చు. అలాగే దీనికి కొంత అమౌంట్ కూడా దుబాయ్ ప్రభుత్వం తీసుకుంటుంది. మన ఇండియా సెలబ్రిటీలలో ఎక్కువగా కేరళ వాళ్లకి గోల్డెన్ వీసా వస్తూ ఉంటుంది. కేరళ వాళ్లకి బిజినెస్ లు దుబాయ్ లో ఎక్కువగా ఉండటంతో వారికి అందిస్తారు. తెలుగు సెలబ్రిటీలతో చాలా తక్కువ మందికి మాత్రమే గోల్డెన్ వీసా లభించింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అల్లు అర్జున్ చేరడం హర్షణీయం.

గోల్డెన్ వీసా పొందిన సెలబ్రెటీలు..

యూఏఈ ప్రభుత్వం నుంచి తొలి ‘గోల్డెన్ వీసా’ను అందుకున్న వ్యక్తి షారుఖ్ ఖాన్. ఆ తర్వాత సంజయ్ దత్, సానియా మీర్జా సైతం గోల్డెన్ వీసాలను పొందారు. అలానే బాలీవుడ్ లో మౌనీ రాయ్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, ఊర్వశీ రౌతేలా, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరా ఖాన్, రణ్‌వీర్ సింగ్ ఉన్నారు. సౌత్ ఇండస్ట్రి నుంచి కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, విక్రమ్, సోను సూద్, టోమినో థామస్, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి.. ఉపాసన, త్రిషా, పూర్ణ, కాజల్ అగర్వాల్, మీనా, ఉన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar