Site icon Prime9

Allu Arjun : వైజాగ్ లో సందడి చేసిన అల్లు అర్జున్.. పుష్ప 2 కోసం 10 రోజులు మకాం

allu arjun coming to vizag for pushpa 2 shooting

allu arjun coming to vizag for pushpa 2 shooting

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” మూవీ దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసింది.

టాలెండెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని… కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా… మలయాళం స్టార్ హీరో ఫహద్ విలన్ గా చేశాడు.

వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ అప్పట్లో హంగామా చేశారు.

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. ‘పుష్ప 1’ సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ‘పుష్ప 2’ మీద అంచనాలు భారీగా పెరిగాయి.

విశాఖలో 10 రోజుల పాటు అల్లు అర్జున్ (Allu Arjun) …

పుష్ఫ2 షూటింగ్ కోసం వైజాగ్ చేరుకున్న అల్లు అర్జున్ మరియు చిత్ర యూనిట్ కు.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ పలికారు.

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

విశాఖ పోలీసులు భారీ బందోబస్తుతో ఐకాన్ స్టార్ ను విమానాశ్రయం నుండి నగరంలోని నోవాటెల్ హోటల్ కు తరలించారు.

హోటల్ వద్ద కూడా అల్లు అభిమానులు సందడిచేసారు. తమ అభిమాన నటుడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

అల్లు అర్జున్ కూడా ఎయిర్ పోర్ట్, హోటల్ వద్ద తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేసారు.

ఐకాన్ స్టార్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా బన్నీని చూస్తే పొడవాటి జుట్టుతో కనిపించారు. సీక్వెల్ కోసం కొత్త స్టైల్ ని అల్లు అర్జున్ ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది.

కాగా ఈ మేరకు 10 రోజుల పాటు వైజాగ్ పోర్ట్ ఏరియాలో ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఆ తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లనున్నారు.

 

 

 

పుష్ప 2 లో జగపతిబాబు..

పుష్ప ఫస్ట్ పార్ట్‌ను సక్సెస్‌ ఫుల్‌గా తీర్చిదిద్దిన సుకుమార్.. సెకండ్ పార్ట్‌ “పుష్ప – ది రూల్” ను అంతకు మించిన గ్రిప్పింగ్ కథనంతో నడిపించనున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యం లోనే మరొక స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం మరో స్టార్ యాక్టర్‌ను తీసుకున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

పుష్ప 2’లో స్టార్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం అందుతుంది.

ఆయన అప్‌ కమింగ్ షెడ్యూల్‌లో షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ చిత్రంలో జగ్గూ భాయ్ చేయబోయే పాత్రపై మేకర్స్ ఎటువంటి అప్‌డేట్ ఇంకా ఇవ్వలేదు.

అల్లు అర్జున్ క్యారెక్టర్ ని మరింత ఎలివేట్ చేసేందుకు మరొక విలన్ రోల్ క్రియేట్ చేశారా ? లేదంటే ఇంకేదైనా పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటించనుందని వార్తలు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar