Site icon Prime9

Adipurush : ఆదిపురుష్ సినిమాని బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ..

all indian cine workers letter to pm modi about adipurush movie ban

all indian cine workers letter to pm modi about adipurush movie ban

Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Adipurush).. మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ను అందుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు వస్తున్న టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ ఆశించిన స్థాయిలో విజయం సాధిచకపోవడంతో నిరాశకు లోనైనా అభిమానులు ఈ విజయంతో మళ్ళీ జోష్ నింపుకుంటున్నారు.
కానీ ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఒకదాని తర్వాత మరొకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) లేఖ రాసింది. సినిమా స్క్రీన్‌ప్లే, అందులోని డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే సినిమాను నిలిపివేయాలని కోరింది. అదే విధంగా ఈ సినిమా హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని.. శ్రీరాముడు అందరికీ దేవుడు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయి అని లేఖలో పేర్కొన్నారు. దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లా చిత్రీకరించారని మండిపడ్డారు.
ఇంతటి అవమానకరమైన చిత్రం.. భారతీయ సినిమా చరిత్రలో భాగం కాకూడదని సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ చెప్పింది. శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా విధ్వంసం చేసేలా ఈ సినిమా ఉందని మండిపడింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని, భవిష్యత్తులో ఓటీటీలో కూడా ప్రదర్శించవద్దని, ఈ మేరకు ఆదేశించాలని ప్రధాని మోదీని కోరింది. అలానే ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రైటర్‌పై కూడా కేసు పెడతామని చెప్పింది.
Exit mobile version