Jr Ntr : రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కించిన “ఆర్‌ఆర్‌ఆర్” సినిమా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుంది. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సీత పాత్రలో అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. కాగా సినిమాలతో బిజినెస్‌లోనూ దూసుకుపోతోన్న అలియా.. తన పిల్లల కోసం “కాన్షియస్ క్లాతింగ్” పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలియా ఎన్టీఆర్ ఫ్యామిలీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందని తెలుస్తుంది.
ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్‌కు ట్యాగ్ లు పెట్టి పంపించింది. కాగా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా షేర్ చేసుకున్నారు తారక్. ‘ థ్యాంక్స్ అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. నా పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా’ అని అలియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి స్పందించిన అలియా .. ‘నీకు మాత్రం ఈద్ స్పెషల్ దుస్తులు సిద్ధం చేస్తానని, స్వీటెస్ట్ పర్సన్ థాంక్యూ’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అలియా, ఎన్టీఆర్‌ల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
They Both🤌🏻🫠@tarak9999 – @aliaa08 IG Stories about her clothing brand.#ManOfMassesNTR #AliaBhatt pic.twitter.com/wK3m2gAML0
— WORLD NTR FANS (@worldNTRfans) March 25, 2023
ఎన్టీఆర్ 30 లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో (Jr Ntr)..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR30 ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ సైతం ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.