Site icon Prime9

Rishi Sunak and Akshata Murthy: 200 కోట్లమంది గూగుల్ లో రిషి సునాక్ దంపతుల గురించి వెతికారు..

Google

Google

Google : బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికవడం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా జరుపుకుంటున్నారు. గ్రేట్ బ్రిటన్ యొక్క మొదటి శ్వేతజాతీయేతర మరియు హిందూ ప్రధాన మంత్రిగా రిషి చరిత్ర సృష్టించాడు. రిషితో పాటు, అతని భార్య మరియు ఇన్ఫోసిస్ బిలియనీర్ నారాయణ మూర్తి మరియు సుధా మూర్తి కుమార్తె అక్షతా మూర్తి కూడా మీడియాలో మరియు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతున్నారు

అక్టోబర్ 26వ తేదీ (బుధవారం) ఒక్కరోజే దాదాపు 200 కోట్ల మంది గూగుల్‌లో రిషి మరియు అక్షత గురించి వెతికారు. సోమవారం, అక్షతా మూర్తి పేరు పై 1 లక్షకు పైగా శోధనలు జరిగాయి. గూగుల్ లో రిషి సునక్ పేరు పై 2 మిలియన్లకు పైగా శోధన ప్రశ్నలు నమోదు చేయబడ్డాయి.

ట్విట్టర్‌లో, అక్టోబర్ 24 నుండిదాదాపు 6,80,000 ట్వీట్‌లు పోస్ట్ చేయబడ్డాయి. ఈ శోధనలు మరియు సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా వరకు రిషి సునక్ మతం, వయస్సు మరియు అతని ఆహార ప్రాధాన్యతలపై రిషి గొడ్డు మాంసం తినడం గురించి వుండటం విశేషం.

Exit mobile version