Site icon Prime9

Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ రూ.18,700 మాత్రమే.. వైరల్ అవుతున్న బిల్ స్లిప్

bullet bike bill slip goes viral

bullet bike bill slip goes viral

Royal Enfield Bullet: బుల్లెట్ బైక్.. ఆ పేరు వింటేనే ఓ రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక యువతలో అయితే దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పు చేసి అయిన బైక్ కొనాలనుకుంటుంటారు కొందరు యూత్. అంతలా ఈ బుల్లెట్ పై లవ్ చూపిస్తుంటారు అబ్బాయిలు. ఇప్పుడంటే బుల్లెట్‌లు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి కానీ, ఒకప్పుట్లో బుల్లెట్ అంటే బాగా డబ్బున్నోడి దగ్గరే ఉండేదని చెప్పవచ్చు. అప్పట్లో బుల్లెట్ కనిపిస్తే చాలు జనం చాలా ఆసక్తిగా చూసేవారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్‌పై ఎవరైనా వస్తే వారిని చాలా గొప్పగా భావించేవారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ఆల్ న్యూ క్లాసిక్’ ఎక్స్ షో రూం ధర ఇప్పుడు రూ. 2.2 లక్షలుగా ఉంది. దీనికి బోలెడన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఒకప్పుడు ఈ బైక్ ధర కేవలం రూ. 18,700 అన్న సంగతి మీకు తెలుసా?

ఏంటి నమ్మడం లేదు కదా..! అయినా, మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే మీరు ఈ బిల్ పేపర్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రసెంట్ ఈ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానిలో 23 జనవరి 1986లో కొన్నట్టుగా ఉంది. ఆ బిల్లును చూసి జనం షాక్ అవుతున్నారు. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీలో ఉన్న సందీప్ ఆటో కంపెనీ 36 సంవత్సరాల క్రితం ఈ బిల్లు జారీ చేసింది. దానిలో ఒక బుల్లెట్ అని రాసి ఉంది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఇండియన్ ఆర్మీ ఎక్కువగా ఉపయోగించేది.

1986 royal Enfield bullet bill slip goes viral

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిల్లుకు ఇప్పటి వరకు 53 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఓ యూజర్ స్పందిస్తూ తన వద్ద 1984 నాటి మోడల్ ఉందని, దాని ధర రూ. 16,100 మాత్రమేనని పేర్కొన్నాడు. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది తన వద్ద భద్రంగా ఉందని రాసుకొచ్చాడు. మరో యూజర్ స్పందిస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ పై ఇప్పుడు కనీసం రూ. 250 రాయితీ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. తాము 1980లో బాంబే (ప్రస్తుతం ముంబై)లోని అలీ భాయ్ ప్రేమ్ జీ డీలర్ వద్ద రూ. 10,500కే బుల్లెట్ కొనుగోలు చేశామని మరో యూజర్ గుర్తు చేసుకున్నాడు. ఇలా ఆనాటి కాలంలోని వస్తువులు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Exit mobile version