Prime9

Mahabubabad: దొంగలు బాబోయ్ దొంగలు.. టమాట, పచ్చిమిర్చిని కూడా వదల్లేదు..!

Mahabubabad: ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకున్నే కూరగాయల్లో టమాట ఒకటి. మధ్యతరగితి ఆపిల్ పండుగా పిలుచుకునే టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అకాల వర్షాలు కారణంగా టమాట దిగుబడి పడిపోవడంతో ఈ కూరగాయకు డిమాండ్ పెరిగిపోయింది. దీనితో టామాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.120 నుంచి రూ. 150 వరకు ధర పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా టమాటా ధరలు భయాందోళన గురిచేస్తున్నాయి. ప్రస్తుతం టమాట ధరలను చూస్తుంటే మరో రెండుమూడు నెలల వరకు వీటి ధరలు అదుపులోకి వచ్చే మాత్రం పరిస్థితి కనిపించటం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో టమాటాను కొనాలంటే పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పచ్చిమిచ్చి ధరలు కూడా అమాంతం పెరిగాయి. ధరల పెరుగులదలతో కూరగాయల మార్కెట్లకు వెళ్లేందుకు సైతం మధ్యతరగతి ప్రజలు వెనుకాడుతున్న పరిస్థితి.

ఇదెక్కడి చిత్రం(Mahabubabad)

ఇలా టమాటా ధరలు పెరగడంతో మార్కెట్లో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా టమాటా ధరలు మండిపోవడంతో వీటిని కొందరు గిఫ్టులుగా మరికొందరు అత్యంత విలువైన బంగారంగా వినియోగిస్తున్నారు. కాగా తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నల్ లో టమాట, పచ్చిమిర్చి ధరలు ఇంత రేటు ఉండడంతో వీటిని కూడా ఏదో బంగారం నగదు చోరీ చేసినట్టుగా దొంగతనం చేశారు. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయని అక్కడి వ్యాపారులు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు టమాటా, పచ్చిమిర్చి బాక్సులను ఎత్తుకెళ్లారని దీనికి సంబంధించిన.. దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడిస్తున్నారు. టాటా ఏస్ వాహనంలో నుంచి టమాటా, పచ్చిమిర్చి బాక్సులు ఎత్తుకెళ్తునట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. టమాటా దొంగల పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Exit mobile version
Skip to toolbar