Prime9

Kaleshwaram: కాళేశ్వరంలో ముగ్గురూ ముగ్గురే.. దృశ్యం సినిమా రిపీట్ అయిందా?

Kaleshwaram Commission Enquiry: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కమిషన్ ముందు 113వ కోర్టు విట్నెస్ హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను అడిగిన ప్రశ్నలకు ఏ జవాబులు చెప్పారో… సేమ్ 114వ కోర్టు విట్నెస్‌గా హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావె సైతం దాదాపు అవే సమాధానాలను కమిషన్‌కు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా, మే 11న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ సైతం అవే జవాబులు చెప్పడంతో ముగ్గురూ ముగ్గురేనన్న అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

 

ఇదిలా ఉండగా, కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ఏకకాలంలో ముగ్గురికి నోటీసులు పంపింది. ఇందులో తొలి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 5వ తేదీన కేసీఆర్, ఈ నెల 6వ తేదీన ఈటల రాజేందర్, 9వ తేదీన హరీశ్ రావు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఆరోగ్యం బాగాలేనందున 5వ తేదీన విచారణకు హాజరు కాలేనని కమిషన్‌కు వివరణ ఇచ్చారు. దీంతో ఆయనకు 11వ తేదీన రావాలని కమిషన్ తదుపరి నోటీసులు పంపించింది.

 

కాగా, అంతకుముందు ఈటల రాజేందర్, హరీశ్ రావులను విచారించిన తర్వాతనే తాను విచారణకు హాజరు కావాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడలో ఇది భాగంగానే జరిగిందని పలువురు అంటున్నారు. అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కావడానికి ముందు కేసీఆర్ కమిషన్ ప్రమాణం చేయించింది. ఈ సందర్భంగా ఆయన భగవంతుడిపై ప్రమాణం చేసి నేను చెప్పేవన్నీ నిజాలే తప్పా మరేమీ కాదని అన్నారు.

 

కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఒకే మాట, ఒకే బాటగా నిలబడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు దాదాపుగా ఒకే రకమైన సమాధానాలు చెప్పారు. విడివిడిగా హాజరైనప్పటికీ జవాబులు ఒకటే ఇచ్చి దృశ్యం సినిమాను తలపించారనే చర్చ జోరుగా సాగుతోంది.

Exit mobile version
Skip to toolbar