Prime9

Electric Shock: కరెంట్ షాక్.. దంపతులు మృతి

Peddapalli District: పెదపల్లి జిల్లా విషాదం చోటు చేసుకొనింది. ఎలిగేడు మండలం సూల్తాన్ పూర్ లో విద్యుత్ షాక్ కు గురై దంపతులు మృతి చెందారు.

పోలీసుల సమాచారం మేరకు రైతు జాతర గొండ ఓదెలు (40) తన భార్య రజిత (36) ఇద్దరూ కలసి పొలం పనులు చేసుకొంటున్నారు. పొలంలో పిచికారీ చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు వారికి తగిలాయి. దీంతో అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: మృత్యుకూపాల ద్వారాలుగా మురికి నాలాలు.. ఆదమరిస్తే అంతే సంగతులు

Exit mobile version
Skip to toolbar