Prime9

CM KCR: నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM kcr nizamabad tour: సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలిక్యాప్టర్ లో జిల్లాకు చేరుకుంటారు. కొత్త కలెక్టరేట్ తో పాటు పార్టీకార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

బందోబస్తు కోసం 12 జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. సుమారు రెండున్నర వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా నిరసనలు చేస్తారనే అనుమానంతో పలురాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar