Prime9

KCR: నేడు కాళేశ్వరం విచారణకు కేసీఆర్.. ఏం జరగనుందో!

Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు.

 

అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ చేస్తారా? అనేది ఆసక్తి నెలకొంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారించింది. అలాగే జూన్ 6న అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను విచారించింది.  జూన్ 9న మాజీ మంత్రి హరీశ్ రావును సైతం కమిషన్ విచారించింది. తాజాగా నేడు జరిగే కేసీఆర్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version
Skip to toolbar