Telangana Assembly Elections: సీపీఎం తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే 14మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయనున్నారు. సత్తుపల్లిలో భారతిని బరిలోకి దింపనున్నారు.
వీరు కాకుండా ఇతర స్దానాలనుంచి పోటీచేసే అభ్యర్దుల వివరాలిలా ఉన్నాయి.భద్రాచలం- కారం పుల్లయ్య, అశ్వారావుపేట-పి. అర్జున్ ,పాలేరు-తమ్మినేని వీరభద్రం, మధిర-పాలడుగు భాస్కర్
వైరా- భూక్యా వీరభద్రం, ఖమ్మం- శ్రీకాంత్,సత్తుపల్లి- భారతి, మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి,నకిరేకల్-చినవెంకులు, భువనగిరి- నర్సింహా, జనగామ- కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం- యాదయ్య
పటాన్ చెరు- మల్లికార్జున్, ముషీరాబాద్ నుంచి దశరథ్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో సీట్ల పంపకానికి సంబంధించిన కసరత్తు ఖరారు కోసం చాలా కాలం వేచి చూసిన తరువాత కూడ తాము అనుకున్న సీట్లను కాంగ్రెస్ ఇవ్వడానికి సిద్దంగా లేదని సీపీఎం ఒంటరిగా పోటచేయడానికి సిద్దమయింది. జాబితాను విడుదల చేసిన అనంతరం వీరభద్రం మాట్లాడుతూ సీపీఐ(ఎం)ని అసెంబ్లీకి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీపీఐ ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వామపక్షాల నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ మైత్రి కొనసాగుతుందని భావించారు. అయితే సీఎం కేసీఆర్ ఎవరినీ వీరిని సంప్రదించకుండానే 115 స్దానాలకు తమ పార్టీ అభ్యర్దులను ఒక్కసారే ప్రకటించేసారు. తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా వీరు అడిగిన స్దానాలను ఇవ్వడానికి మొగ్గు చూపకపోవడంతో చివరికి ఒంటరిపోరుకు సిద్దమయ్యారు.