Site icon Prime9

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

Telangana Assembly Elections

Telangana Assembly Elections

 Telangana Assembly Elections: తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు..( Telangana Assembly Elections)

ముగ్గురు ఎంపీలకు కూడా బీజేపీ అధిష్టానం అసెంబ్లీ సీట్లను ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. రాజాసింగ్ పైన ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి.. మరోసారి గోషామహల్ నుంచి అవకాశం కల్పించారు. ఇక బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, జీ.లక్ష్మణ్ లకు మొదటి జాబితాలో అవకాశం కల్పించలేదు. అయితే వారిద్దరూ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మారుతారని అప్పట్లో ప్రచారం జరిగిన మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని.. చెన్నూరు నుంచి అధిష్టానం రంగంలోకి దించింది. మహబూబ్ నగర్ జిల్లాలో స్ట్రాంగ్ లీడర్ అయిన డీకే అరుణను కూడా గద్వాల్ నుంచి పోటీకి దించారు.

రాజాసింగ్ పై సస్పెన్సన్ ఎత్తివేత..

గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేశారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సస్సెన్షన్ ఎత్తివేయడంతో.. గోషామహల్ అసెంబ్లీ టిక్కెట్ కూడా రాజాసింగ్ కు బిజెపి అధిష్టానం కేటాయించింది. బీజేపీ విడుదల చేయబోయే తొలి జాబితాలో రాజాసింగ్ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి రాజా సింగ్. మహమ్మద్ ప్రవక్తని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గతంలో రాజాసింగ్‌ను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలో భాగంగా గతేడాది ఆగస్టులో రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు.

Exit mobile version