Prime Minister Modi: తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ తూప్రాన్ సకల జనుల సంకల్ప సభలో ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు…ఇక సినిమా చూస్తారని మోదీ అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ తోనే సాధ్యమని మోదీ చెప్పారు. గద్వాలలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే కేసిఆర్ కామారెడ్డినుంచి కూడా పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
నవంబర్ 26 ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.చేతకాని, అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుంది.ఎందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.గజ్వేల్ లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓటమీ భయంతో కేసీఆర్ వేరే చోటికి వెళ్లారు.గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారు. ప్రజలను కలవని, ఫామ్ హౌస్ లో పడుకునే, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఫామ్ హౌస్ నుంచి పాలన సాగించే కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలన్నారు. దళితలకు ధలితబంధు అంటూ దళిత సీఎం అంటూ మోసం చేసారని అన్ని అబద్దపు హామీలిచ్చే కేసీఆర్ ను దేవుడు కూడా క్షమించడని అన్నారు. మల్లన్న సాగర్ కట్టి పేదరైతులను రోడ్డు పాలు చేసారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని అన్నారు.