Site icon Prime9

WhatsApp: 24 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్

whatsapp prime9news

whatsapp prime9news

WhatsApp: ఈ రోజుల్లో వాట్సప్ అంటే తెలియని ఎవరు లేరు అలాగే దీన్ని మెయింటెన్  చేయని వాళ్ళు కూడా లేరు ప్రస్తుత సమాజమంతా సోషల్ మీడియాతోనే బ్రతుకుతుంది. ఐతే వాట్సప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. వాట్సప్ వాడే వాళ్ళులో కొంత మందిని జూలైలో భారతదేశంలో 23.87 లక్షల మంది వాట్సప్ అకౌంట్లను నిషేదించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వాట్సప్ అకౌంట్స్  ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కొన్ని చర్చలు జరిగాయి. 2022 జూన్‌లో 22 లక్షలకు పైగా అకౌంట్లను, మేలో 19 లక్షల వాట్సప్ అకౌంట్లను పూర్తిగా బ్యాన్‌ చేసింది.

వీళ్లందరు వాట్సప్ నిబంధనలను పాటించకపోవడం వల్లే వీళ్ళను బ్యాన్ చేసినట్టు వాట్సప్ మెసేజ్ ద్వారా వాళ్ళకి వెల్లడించింది. ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం ఈ నిబంధనలను ఒక నివేదికలో వాట్సాప్ ఈ వివరాలను ఆడించినట్టు తెలిసిన సమాచారం. యూజర్ల ఫిర్యాదుల మేరకు మేము తీసుకున్న చర్యలను కూడా వివరాలను కూడా పొందుపరిచినట్టు వాట్సాప్ సంస్థ వారు వెల్లడించారు.

జూలైలో మాకు అందిన 574 ఫిర్యాదుల్లో 392 నివేదికలు మాత్రం ‘బ్యాన్ అప్పీల్’ గా మిగతావి ఖాతా, ప్రొడక్ట్స్‌ వంటివి వచ్చాయని తెలిపారు. 2022 జూలై 1, జూలై 31 మధ్యలో 23,87,000 మంది వాట్సాప్ అకౌంట్లను నిషేధించామని, వాటిలో 14,16,000 మంది అకౌంట్లను ముందుగానే బ్యాన్‌ చేశామని నివేదికలో పేర్కొన్నారు. కానీ అంతకు ముందే జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల్లో మెసేజింగ్ ద్వారా వాటిలో 64 అకౌంట్ల పై మేము చర్యలు తీసుకున్నామని వాట్సప్ వారు వెల్లడించారు.

Exit mobile version