RBI: మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్దం అవుతోంది. లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ సోమవారం ప్రకటించిన తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా(RBI)
అయితే, ఇది డిజిటల్ చెల్లింపులకు సమానమైనదని.. దీనిని ‘బంకర్’అని పిలుస్తోంది. ప్రకృతి విపత్తులు లేదా యుద్ధం లాంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ ‘లైట్ వెయిట్ పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్’ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కోంది. దీనిని తక్కువ మంది సిబ్బందితో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయోచ్చని తెలిపింది. ప్రస్తుతం యూపీఐ, ఎన్ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్ చెల్లింపుల వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి. పెద్ద మొత్తంలో నగదును సులవుగా పంపేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడతాయి. వీటికి నెట్‌వర్క్, ఐటీ సదుపాయాలు అవసరం ఉంటుంది.
అవసరాన్ని బట్టి యాక్టివ్ చేసుకునే వీలు(RBI)
అయితే అనుకోకుండా ప్రకృతి వైఫరీత్యాలు, యుద్ధం లాంటి సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడినప్పుడు ఈ చెల్లింపుల వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి విపత్కర, ఎమర్జెన్సీ సమయంలో సరికొత్త పేమెంట్ వ్యవస్థ ‘లైట్‌వెయిట్’ ఉపయోగపడనుందని ఆర్బీఐ ఆలోచిస్తుంది. పరిమిత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా దీనిని రూపొందించనున్నట్టు తెలిపింది. అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఈ సిస్టమ్ ను యాక్టివ్ చేసుకునేలా ఉపయెగపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.