Site icon Prime9

Whatsapp: వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

whatsapp new update

whatsapp new update

Whatsapp: నేటి సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉండటం అలవాటయ్యింది. ఫోన్ లేకపోతే ఏదో శరీరంలో ఓ భాగం లేనట్టు ఫీల్ అయ్యే వారూ లేకపోలేరు. అయితే ఈ చరవాణీలో ముఖ్యమైన యాప్ లలో ఒకటి వాట్సాప్. ఇంక ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్‌ ఉంటుంది. వాట్సాప్‌ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

అయితే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థి కంపెనీల పోటీని సైతం ఎదుర్కొని తనదైన శైలిలో నిలదొక్కుకుంటోంది. కాగా వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను వినియోగదారులకు పరియం చేయనుంది. సాధారణంగా ఒక వాట్సాప్‌ గ్రూప్‌లో 512 మంది వరకు మాత్రమే యాడ్‌ చేసుకునే వీలుంది. అయితే ఈ పరిమితిని పెంచేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ కొత్త ఆప్షన్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురాన్నారు. ఇంక ఈ ఆప్షన్‌ అందుబాటులోకి వస్తే గతంలో కంటే ఇది రెట్టింపుగా ఒక గ్రూప్‌ అడ్మిన్‌ ఏకంగా 1024 మందిని గ్రూప్‌లో యాడ్ చేయవచ్చు. ఈ విషయాన్ని వాబేటా ఇన్ఫో ఓ ట్వీట్‌ ద్వారా వినియోగదారులకు తెలిపింది. ఈ నూతన అప్డేట్ ను ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: జియో 5జీ.. వారికి అన్నీ ఫ్రీ.. ఫ్రీ

Exit mobile version