Site icon Prime9

Netflix subscription: యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన నెట్‌ఫ్లిక్స్

Netflix subscription

Netflix subscription

Netflix subscription: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్కైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సబ్ స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన చార్జీలు భారత్ తో పాటు 115 దేశాల్లో సబ్ స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2021 లో భారత్ లో తక్కువ ధర సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దేశంలో కస్టమర్ల ఎంగేజ్ మెంట్ లో 30 శాతం పెరుగుదలతో పాటు వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగదలను నమోదు చేసింది. దీంతో భారతీయ మార్కెట్ పై నెట్ ఫ్లిక్స్ మొదటిసారిగా 20 నుంచి 60 శాతం చార్జీలను తగ్గించింది.

 

పోటీని తట్టుకునేందుకు(Netflix subscription)

నెట్ ఫ్లిక్స్ తాజా చార్జీల ప్రకారం.. గతంలో నెలకు రూ. 199 ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ (మొబైల్ ప్లాన్ ) ఇప్పుడు రూ. 149 లకు తగ్గింది. అదే విధంగా టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్‌.. అన్నింటిలో యాక్సెస్ చేసుకోగలిగే బేస్‌ సబ్‌స్క్రిప్షన్ చార్జీ గతంలో రూ. 499 ఉండగా ప్రస్తుతం రూ. 199 గా ఉంది. లాటిన్ అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లో కొన్ని దేశాల్లో ఈ సబ్‌స్క్రిప్షన్ చార్జీలు తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులతో వినోదాలపై పెట్టే ఖర్చులు తగ్గిపోతున్నాయి. అదే విధంగా ప్రత్యర్థులతో కాంపిటేషన్ పెరుగుతుండటంతో పోటీని తట్టుకునేందుకు నెట్ ఫ్లిక్స్ చార్జీల తగ్గుదలపై దృష్టి పెట్టింది.

 

పాస్ వర్డ్ షేరింగ్ తీసివేత

గతంలో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లాటిన్ అమెరికాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అక్కడ విజయవంతం కావడంతో మరికొన్ని దేశాలకు విస్తరించింది.కెనడా, న్యూజిలాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో ఈ స్కీం ను అమలు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలోని చందాదారులకు పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను నెట్ ఫ్లిక్స్ తీసివేసింది. అయినా, వారు తమ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ అకౌంట్‌ను మాత్రం ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ప్రస్తుత వినియోగదార్లు అకౌంట్‌ను బదిలీ చేస్తే వారి రికమండేషన్స్, హిస్టరీ, మై లిస్ట్, సేవ్డ్ గేమ్స్‌తో సహా మరికొన్ని కొత్త అకౌంట్స్ హోల్డర్స్ చూసే అవకాశం ఉంది.

 

Exit mobile version