Netflix Password Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు భారీ షాక్ తగిలింది. పాస్ వర్డ్ షేరింగ్ పై నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయం అసలుకే మోసం తెచ్చింది. పాస్ వర్డ్ షేరింగ్ చర్యలతో స్పెయిన్ లో ఏకంగా 10 లక్షల మంది యూజర్లు నెట్ ఫ్లిక్స్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ‘కాంటార్’ అనే ప్రముఖ మార్కెట్ రీసెర్చి సంస్థ రిపోర్టు వెల్లడించింది. స్పెయిన్ లో ఈ సంవత్సరం ఏడాది ఫిబ్రవరిలో పాస్ వర్డ్ షేరింగ్ కు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఒకే ఇంట్లో వారు కాకుండా ఇతరులు అదే అకౌంట్ ను వాడటాన్ని నెట్ ఫ్లిక్స్ నియంత్రించింది. ఒక వేళ పాస్ వర్డ్ షేరింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒక్కో అకౌంట్ కు నెలకు 6.57 డాలర్లు చొప్పున ఫీజుపెడుతూ నిర్ణయం తీసుకుంది. పాస్ వర్డ్ షేరింగ్ పై ఫీజు ను పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్ లోనూ అమలు చేసింది.
రానున్న రోజుల్లో మరింత ఎఫెక్ట్(Netflix Password Sharing)
కాగా, స్పెయిన్ లో ప్రతి ముగ్గిరిలో ఇద్దరు వేరే పాస్ వర్డ్ ను ఉపయోగించి నెట్ ఫ్లిక్స్ ను చూస్తున్నారని కాంటార్ రిపోర్ట్ం చేసింది. దీంతో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దాదాపు 10 లక్షల మంది కి పైగా యూజర్లను నెట్ ఫ్లిక్స్ పోగొట్టుకుందని తేలింది. అయితే నెట్ ఫ్లిక్స్ ను వీడిన వాళ్లలో ఎవరూ పెయిడ్ సబ్ స్క్రూబర్లు కాదని చెప్పింది. కానీ , ఇలాంటి చర్యల వల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. మరోవైపు మొదటి త్రైమాసికంలో సబ్ స్క్రిప్షన్ నుంచి వైదొలిగిన వారు గత ఏడాదిలో పోలిస్తే మూడింతలు పెరిగినట్టు కాంటార్ సంస్థ గుర్తించింది. అంతేకాకుండా స్పెయిన్ లో రెండో త్రైమాసికం నాటికి నెట్ ఫ్లిక్స్ ను 10 వ వంతు వీడనున్నారని ఈ అధ్యయనం తెలిపింది.
పెయిడ్ మెంబర్ షిప్స్ పెరిగాయి : నెట్ ఫ్లిక్స్
స్పెయిన్ లో యూజర్లు కోల్పోడంపై నెట్ ఫ్లిక్స్ స్పందించింది. పాస్ వర్డ్ షేరింగ్ కు డబ్బులు వసూలు చేయాలనుకున్న దేశాల్లో క్యాన్సిలేషన్లు జరుగుతున్న విషయాన్ని గుర్తించినట్టు సంస్థ పేర్కొంది. నిజానికి యూజర్ల సంఖ్య తగ్గినా.. పెయిడ్ మెంబర్ షిప్స్ పెరిగాయని తెలిపింది. అయితే పాస్ వర్డ్ షేరింగ్ ప్లాన్ , యాడ్స్ తో ఉండే చౌక ప్లాన్స్ వల్ల ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ది ఎక్కువగా నమోదు చేస్తామని నెట్ ఫ్లిక్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.