Netflix down: నిలిచిపోయిన నెట్ ఫ్లిక్స్ ప్రసారాలు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్‌ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి.

Netflix down: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. కొంత మంది సబ్‌ స్క్రైబర్స్ కు ఆదివారం సేవలు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటక్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. సాయంత్రం యునైటెడ్ స్టేట్స్ లో 11 వేల కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్ ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది.

గంటకు పైగా అంతరాయం(Netflix down)

 

భారత కాలమాన ప్రకారం.. ఆదివారం ఉదయం 5 గంటలకు నిలిచిపోయిన నెట్ ఫ్లిక్స్ సేవలు 6.49 గంటలకు తిరిగి వచ్చాయి. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ అనే కార్యక్రమం స్ట్రీమింగ్‌ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత టైం ప్రకారం ఉదయం 5:30) మొదలు కావాల్సి ఉంది. ఈ షో కోసం సబ్‌ స్క్రైబర్స్ లు 10 నిమిషాల ముందే నుంచి వేచి ఉన్నారు. ఇంతలో నెట్ ఫ్లిక్స్ సేవల్లో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచి ఉండాల్సి వచ్చింది.

 

ఆలస్యంగా మేల్కొన్న నెట్ ఫ్లిక్స్

ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 గంటలకు ప్రారంభమైంది. అయితే ఆలస్యంగా మేల్కొన్న నెట్‌ఫ్లిక్స్‌.. యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్‌ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటలకు ట్వీట్ తో స్పందించింది.