Site icon Prime9

iPhone: భారీ అప్‌గ్రేడ్‌లతో రానున్న ఐఫోన్ 15

iphone-15-likely-to-offer-big-upgrades

iphone-15-likely-to-offer-big-upgrades

iPhone: యాపిల్ కొద్దినెల‌ల కింద‌ట ఐఫోన్ 14ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14లో పెద్దగా అప్‌గ్రేడ్‌లు లేక‌పోవ‌డంతో కొనుగోలుదారులు ఈ డివైజ్ కొనడానికి పెద్దగా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌ంలేదు. అక్క‌డ‌క్కడా కొద్దిపాటి మార్పులు మిన‌హా ఫీచ‌ర్లు, డిజైన్ ప‌రంగా ఐఫోన్ 13, ఐఫోన్ 14 దాదాపు రెండూ ఒకే ర‌కంగా ఉన్నాయని యూజర్లు అంటున్నారు. రెండు ప్రీమియం మోడ‌ల్స్ ఒకే త‌ర‌హాలో ఉండడం వల్ల ఐఫోన్ 14 తీసుకోవాలనుకు వినియోగదారులు కాస్త ఐఫోన్ 15 కోసం వేచిచూస్తున్నారు. దీనితో వ‌చ్చే ఏడాది లాంఛ్ కానున్న ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్‌గ్రేడ్‌లు చేప‌ట్ట‌నుంద‌ని టెక్ నిపుణులు చెప్తున్నారు.

పెరిస్కోప్ లెన్స్‌తో 5x లేదారానున్న ఐఫోన్ 15 న్యూ బ‌యోనిక్ ఏ17 బ‌యోనిక్ చిప్‌సెట్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడ‌ల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ స‌న్నాహాలు చేస్తుంది. 10x ఆప్టిక‌ల్ జూమ్‌ను యాపిల్ ఆఫ‌ర్ చేయ‌నుంది. ఐఫోన్ 15లో మెరుగైన బ్యాట‌రీ లైఫ్‌ను అందించేందుకు కసరత్తులు చేస్తోందిని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. కొత్త జీమెయిల్ డిజైన్ తప్పనిసరి

 

Exit mobile version