Site icon Prime9

WhatsApp New update: మరో అదిరిపోయే అప్డేట్ తో వాట్సాప్..!

interesting-details-about-whatsapp-new-features

interesting-details-about-whatsapp-new-features

Technology News: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు. చిన్నల నుంచి పెద్దల వరకు వాట్సాప్ వినియోగం గురించి అందరికీ తెలుసు. మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్డేట్ లతో యూజర్స్ కి మరింత మెరుగైన సేవలందించడానికి వాట్సాప్ సంస్థ కృషి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ను మరింత సౌకర్యవంతంగా వినియోగించు కోవడానికి పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో మరొక యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ… వీడియో కాల్‌లో మాట్లాడుకునే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

కాగా ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైనా వాట్సాప్ బీటా 22.24.0.79 అప్‌డేట్ చేసుకుంటారో వారి యాప్‌లో మాత్రమే ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుపుతున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది. వీటితో పాటే త్వరలో మరిన్ని నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు.

Exit mobile version