Site icon Prime9

Smart Watch: యాపిల్ స్మార్ట్ వాచ్ తో ప్రెగ్నెన్సీ టెస్ట్..!

apple smart watch alerts pregnancy

apple smart watch alerts pregnancy

Smart Watch: మార్కెట్‌లో స్మార్ట్‌ వాచ్‌ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్లతో శరీరంలో జరిగే అనూహ్య మార్పులను సులువుగా గుర్తించవచ్చు. ఇలాంటి వాటికే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ తరహాలోనే ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని కూడా ముందుగానే యాపిల్‌ వాచ్‌ గుర్తించింది. మరి దాని విశేషాలేంటో తెలుసుకుందాం

తాను గర్భం దాల్చిన విషయం తనకంటే ముందే యాపిల్‌ వాచ్‌ తనకు సూచించిందని ఓ 34ఏళ్ల మహిళ తెలిపింది. తన యావరేజ్‌ రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ కొన్ని రోజులలో గణనీయంగా పెరిగిందని యాపిల్‌ వాచ్‌ చూపించిందని పేర్కొనింది. దానితో శరీరంలో ఏవో మార్పులు జరిగినట్లు అనుమానించి రెడ్డిట్‌ పోస్ట్‌ ద్వారా ఆమె పేర్కొనింది. సాధారణంగా నా రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌ 57గా ఉంటుంది. కాగా గత కొద్ది రోజులలోనే ఇది 72కి పెరిగిందని ఇది ఆందోళన చెందాల్సిన స్థాయి మార్పులు కాకపోయినా.. 15 రోజుల్లోనే ఈ హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నట్లు వాచ్‌ నన్ను అలర్ట్‌ చేసిందని ఆమె సోషల్ బ్లాగింగ్ అయిన రెడ్డిట్ ద్వారా తెలిపింది. ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. అయితే నాకు తెలియకముందే నేను గర్భం దాల్చినట్లు యాపిల్ వాచ్కు తెలుసుని, పీరియడ్‌ ఎప్పుడూ ఆలస్యం కాలేదు, కానీ ఈ సారి ఆలస్యం అయిందని, అందుకే ఎలాంటి టెస్టింగ్‌ కూడా చేయించుకోలేదని ఈ విషయం కేవలం తనకు వాచ్‌ రీడింగ్‌తోనే అని ఆమె వెల్లడించింది.

ఇకపోతే టెక్ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఇండియాలో వాచ్ సిరీస్ 8ను ప్రకటించింది. ఈ వాచ్లో మహిళల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు అత్యాధునిక ఫీచర్లను, హెల్త్‌ కేపబిలిటీస్‌ను అందిస్తుంది. యాసిల్‌ సిరీస్ 8, శరీరం బేసల్ టెంపరేచర్‌ను గుర్తించడంలో సహాయపడే కొత్త టెంపరేచర్‌ సెన్సార్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్స్ కేవలం యాపిల్ సిరీస్ అయిన 8, అల్ట్రాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్స్ ద్వారా మహిళల పీరియడ్‌ డేట్స్ గురించి అలర్ట్‌ చేస్తుంది. పీరియడ్స్‌ సైకిల్‌ను ట్రాక్‌ చేసుకోవచ్చు. కాగా యాపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ.45,900 కాగా, యాపిల్ వాచ్ SEప్రారంభ ధర రూ.29,900గా ఉంది.

ఇదీ చదవండి: వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Exit mobile version