World Test Championship: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ తేదీ ఖరారు అయింది.
ఇంగ్లండలోని ప్రఖ్యాత ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7-11 వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది.
జూన్ 12 న రిజర్వ్ డేగా పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ వివరాలను వెల్లడించింది.
న్యూజిలాండ్ దే మొదటి ట్రోఫీ
వరల్డ్ టెస్ట్ ఛాంపిచన్ షిప్ తొలి టైటిల్ సాధించి న్యూజిలాండ్ హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్, టీమిండియా పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్ లో విజయం సాధించిన కివీస్ ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది.
ఇపుడు తాజా సీజన్ లో ఆస్ట్రేలియా , టీమిండియాలు ఫైనల్ బెర్త్ ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9 నుంచి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలకం కానుంది. టాప్ 2 లో ఉన్న ఈ రెండు జట్లకు ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.
అపుడే పాయింట్ల పట్టికలో స్పష్టత
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రెండేళ్లు కొనసాగుతుంది. ఈ రెండేళ్ల పాటు ప్రతి జట్టు సిరీస్ లు ఆడుతుంది.
టాప్ 2 లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. రెండో సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 136 (75.56%) పాయింట్ల తో టాప్ లో ఉంది.
ఇండియా 99 (58.93%) పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లతో పాటు మరో నాలుగు టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడతున్నాయి.
పట్టిక లో 64 (53.33%) పాయింట్లతో శ్రీలంక మూడో స్థానం, 76 (48.72) పాయింట్లతో దక్షిణాఫ్రికా నాల్గవ ప్లేసులో, ఇంగ్లాండ్ 124 (46.97%) పాయింట్ల తో ఐదో స్థానం లో ఉన్నాయి.
ఈ 4 జట్లకు ఫైనల్ లో చోటు లభించే అవకాశం ఉంది.
అయితే శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లకు మిగిలిన సిరీస్ ఫలితం తేలిన తర్వాతే పాయింట్ల పట్టికలో స్పష్టత వస్తుంది.
The Oval in London will host the #WTC23 final, while the venue for the #WTC25 final has also been decided 🏏
More 👉 https://t.co/KAwg8uVJdN pic.twitter.com/w9qS7U8tEm
— ICC (@ICC) September 21, 2022
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధం
డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్, ర్యాంకింగ్స్‌లో మొదటి ప్లేస్… ఈ రెండు కీలక అంశాలను తేల్చే బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది.
నాలుగు మ్యాచ్ ల సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరగనుంది. నాగపూర్ వేదికగా గురువారం భారత్ , ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు తో సిరీస్ ప్రారంభం కానుంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై ఇండియానే పైచేయి సాధించింది. చివరి మూడు సిరీస్ లను కూడా ఇండియానే గెలవడం విశేషం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/