Site icon Prime9

Virender Sehwag: ‘ధోనీని ప్రతిసారి అదే ప్రశ్న ఎందుకు అడుగుతారు’

Virender Sehwag

Virender Sehwag

Virender Sehwag: భారత స్టార్ క్రికెటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజనే చివరది అంటూ ప్రతి లీగ్ కు ముందు వార్తలు రావడం జరుగుతోంది. ధోని రిటైర్మెంట్ పై వివిధ రకాలుగా పలువరు స్పందించడం చూస్తూనే ఉన్నాం. అయితే రిటైర్మెంట్ పై ధోని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోని తన రిటైర్మెంట్ వార్తలపై రియాక్ట్ అయ్యాడు.

 

మీరే నిర్ణయించుకున్నారు: ధోనీ(Virender Sehwag)

లక్నోతో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన బౌలింగ్‌ ఎంచుకున్న ధోనీ తో కామెంటేటర్ మాట్లాడుతూ ‘మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు చెన్నై సారథి ‘ఇది నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. కానీ నేను కాదు’ అంటూ నవ్వుతూ తనదైన స్టయిల్ లో సమాధానమిచ్చాడు. అనంతరం కామెంటేటర్‌.. స్టేడియంలో ధోనీ కోసం వచ్చిన ఫ్యాన్స్ ను చూపిస్తూ.. ‘మహీ వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడేందుకు వస్తాడు’ అని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ లో ఉన్న చిన్న అనుమానం తీరిపోయింది. ఇది ధోని చివరి సీజన్ కాదంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.

 

తీవ్ర అసహనం..

అయితే, ధోనీ రిటైర్‌మెంట్ వార్తలపై టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ధోనిని ప్రతిసారి అవే ప్రశ్నలతో ఒత్తిడికి గురి చేయడం సరైంది కాదన్నాడు. అదే విధంగా ధోనీ కూడా ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదని తెలిపాడు. తన రిటైర్మెంట్ కు సంబంధించిన విషయాన్ని ధోనినే సరైన సమయంలో అందరికీ తెలియజేస్తాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘ధోనీని ప్రతిసారి ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ఇదే అతడికి చివరి సీజన్‌ అని అనుకుందాం.. మళ్లీ మళ్లీ అడగాల్సిన అవసరం ఏంటి? తుది నిర్ణయం అతనే తీసుకుంటాడు. అది అభిమానులకు కూడా తెలియజేస్తాడు. ‘ఇదే నాకు చివరి సీజన్‌’ అనే సమాధానాన్ని ధోని నుంచి రాబట్టాలని సదరు కామెంటేటర్ అనుకుని ఉంటాడు. ఇది చివరి సీజనా..? కాదా..? అనేది కేవలం ధోనీకి మాత్రమే తెలుసు. అతడే సరైన సమయంలో వెల్లడిస్తాడు’ అని సెహ్వాగ్ స్పష్టం అన్నాడు.

 

 

Exit mobile version