Ind vs Aus 4th Test: ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటైన జవాబు ఇస్తోంది. ఈ మ్యాచ్ లో విరాట్ శతకంతో చెలరేగిపోయాడు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత విరాట్ శతకం సాధించాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 5 వికెట్లు కోల్పోయి.. 472 పరుగులు చేసింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉండటంతో.. మరింత స్కోర్ చేసేలా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా తన మెుదటి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటింగ్ లో ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేయగా.. కామెరున్ గ్రీన్ సెంచరీతో రాణించాడు. దీంతో కంగారు జట్టు భారీ స్కోర్ సాధించింది. ఇక భారత బ్యాటింగ్ లో విరాట్ కోహ్లితో పాటు.. శుభ్ మన్ గిల్ సెంచరీతో రాణించాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది.
నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు. విరాట్ దాదాపు 1200 రోజుల నుంచి టెస్టుల్లో సెంచరీ కోసం వేచి చూస్తున్నాడు. 1200 రోజుల నీరిక్షణకు నేడు తెరపడింది. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. టెస్టుల్లో విరాట్‌కిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తంగా 75 సెంచరీలు సాధించాడు. కోహ్లీ 241బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. విరాట్ 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్ పై చివరిసారిగా టెస్టు శతకం సాధించాడు.
ఈ టెస్టు శతకంతో విరాట్ స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత ఆసీస్‌పై సెంచరీ నమోదు చేశాడు. గతంలో 2013లో చెపాక్ వేదికగా సెంచరీ చేశాడు. దాదాపు 41 ఇన్నింగ్స్ ల తర్వాత విరాట్ సెంచరీని అందుకున్నాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా 241 బంతుల్లో 100 పరుగుల మార్క్ ను కోహ్లీ అందుకున్నాడు. విరాట్ సెంచరీతో స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాట్‌తో అభివాదం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇది ఓవరాల్‌గా 16వ సెంచరీ.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు