FIFA World Cup: ప్రపంచకప్ లో మరో సంచలనం.. ఫ్రాన్స్ ఓడించిన పసికూన

ఫిఫా ప్రపంచ కప్‌ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.

FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్‌ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. అర్జెంటీనాకు ఏ మాత్రం సాటికాని సౌదీ జట్టు మెస్సీ సేనను మట్టికరిపించి పెను సంచలనం సృష్టించిన విషయం మరువక ముందే తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.

వరుసగా రెండు విజయాలతో అందరికంటే ముందే ప్రిక్వార్టర్స్‌ బెర్తు దక్కించుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ కు ఆఖరి లీగ్‌ మ్యాచ్ లో ట్యునీషియా జట్టు షాకిచ్చి మెగా టోర్నీలో సంచలనం రేపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పోరులో ట్యునీషియా 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అయితే, మరో మ్యాచ్‌లో డెన్మార్క్‌ను ఆస్ట్రేలియా ఓడించడంతో ట్యునీషియాకు నాకౌట్‌ బెర్తు దూరమైంది. అయినా, తాము ఇంటికెళుతూ వెళ్తూ తమ దేశ చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బంతిని ఎక్కువగా తమ అధీనంలోనే ఉంచుకున్నా, ఎన్నో దాడులు చేసినా ఫ్రాన్స్‌ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది.
2014 వరల్డ్‌కప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ తర్వాత మెగా టోర్నీలో ఫ్రాన్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం.

ఇదీ చదవండి: వివాదాస్పదమైన మెస్సీ ప్రవర్తన.. బాక్సర్ హెచ్చరిక