TATA IPL: ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఓ పండగ. ఐపీఎల్ 2023లో ఇప్పటికే సగం లీగ్ మ్యాచలు ముగిశాయి. అయితే ఇందులో కొన్ని జట్లు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే.. మరికొన్నిజట్లు తేలిపోతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో పెద్ద జట్లు అనుకున్నవి కూడా కాస్త వెనుకబడ్డాయి. సగం లీగ్ పూర్తయ్యేసరికి పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన జట్లేవో ఓసారి లుక్కేద్దాం.
పాయింట్ల పట్టిక ఇలా.. (TATA IPL)
ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఓ పండగ. ఐపీఎల్ 2023లో ఇప్పటికే సగం లీగ్ మ్యాచలు ముగిశాయి. అయితే ఇందులో కొన్ని జట్లు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే.. మరికొన్నిజట్లు తేలిపోతున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో పెద్ద జట్లు అనుకున్నవి కూడా కాస్త వెనుకబడ్డాయి. సగం లీగ్ పూర్తయ్యేసరికి పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన జట్లేవో ఓసారి లుక్కేద్దాం.
ఐపీఎల్ సీజన్ సగం పూర్తయ్యేసరికి ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ సీజన్ ఇప్పటివరకైతే.. రసవత్తరంగా సాగుతోంది.
ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ దాకా వెళ్లి.. క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది.
ఐపీఎల్ సీజన్ మెుత్తం 70 మ్యాచుల్లో ఇప్పటికి 35 మ్యాచులు పూర్తయ్యాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మెుదటి స్థానంలో ఉంది.
ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్, లక్నో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్: ఈ ఏడాది చెన్నై ఓటమితో సీజన్ ను ఆరభించింది. అయిన వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది.
ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింట గెలిచి.. రెండు ఓడింది. ప్రస్తుతం ఈ జట్టు పది పాయింట్లతో ముందుంది.
గుజరాత్ టైటాన్స్: గతేడాది విన్నర్ గా నిలిచిన గుజరాత్.. ఈ సీజన్ లోను అదరగొడుతుంది.
ఏడు మ్యాచుల్లో ఐదింట గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. నెట్ రన్‌రేట్ కారణంగా గుజరాత్ రెండో స్థానానికి పరిమితమైంది.
రాజస్థాన్ రాయల్స్: సన్‌రైజర్స్ పై ఘన విజయం సాధించి.. ఈ సీజన్ అద్భుతంగా ఆరంభించింది రాజస్థాన్.
రెండో మ్యాచ్ ఓడిన.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో పుంజుకొంది.
కానీ తర్వాతి జరిగిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్: ఈ జట్టు అవకాశాలు మెండుగా ఉన్న.. అదృష్టం కలసి రావడం లేదు.
గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడం ఈ జట్టు ప్రత్యేకత.
తాజాగా గుజరాత్‌పై ఏడో మ్యాచ్ ఆడిన ఎల్‌ఎస్‌జీ కేవలం ఏడు పరుగుల తేడాతో ఓడింది.
ఏడింట్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఇప్పటి వరకు ఏడు మ్యాచులాడిన బెంగళూరు.. నాలుగింట విజయం సాధించింది.
ఈ జట్టు ముఖ్యంగా ముగ్గురు బ్యాటర్లపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది పంజాబ్ జట్టు.
కానీ ఆ తర్వాత వరుస ఓటములతో.. వెనుకంజ వేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ముంబయి ఇండియన్స్: ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన మంబయి ఈ సీజన్ లో కష్టపడుతోంది.
మెుదటి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి.. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి రేసులోకి వచ్చింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్: తొలి మ్యాచ్‌లో అదృష్టం కలిసిరాక డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో పంజాబ్ మీద ఓడింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో విజయఢంకా మోగించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌పై చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి మరీ కోల్‌కతాను రింకు సింగ్ గెలిపించాడు.
అయితే, అప్పటి నుంచి ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: సన్ రైజర్స్ జట్టు పరిస్థితి వేరు. గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఈ జట్టు ఓడిపోవడం దీని ప్రత్యేకత.
పేరులో రైజింగ్ మాత్రం ఈ జట్టులో లేదు. ఏడు మ్యాచుల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది.
దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్ లేని లోటు దిల్లీ క్యాపిటల్స్‌కు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో ఎన్నోసార్లు జట్టును కాపాడిన అనుభవం రిషభ్ పంత్ సొంతం.
వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన దిల్లీ.. ఎట్టకేలకు విజయాల బాట పట్టింది.
కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి నాలుగు పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.