Site icon Prime9

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ బోణి కొడుతుందా..? పంజాబ్ హ్యాట్రికా సాధిస్తుందా..?

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad: ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా బోణి కొట్టలేదు. మొదటి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన సన్ రైజర్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది. మూడో మ్యాచ్ లో అయినా గెలుపు బాట పట్టాలని చూస్తోంది. అయితే సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగం బలపడితే తప్ప గాడిన పడే ఛాన్స్ కనిపించడంలేదు. గత రెండు మ్యాచ్ ల్లోనూ హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు.

బ్యాటర్స్ పుంజుకుంటేనే..(Sunrisers Hyderabad)

టాపార్డర్ లో తడబడుతున్న హైదరాబాద్ గత రెండు మ్యాచుల్లో పవర్ ప్లేలో కనీసం 50 పరుగులు చేయలేకపోయింది. గత మ్యాచ్ లో కొత్త సారథి మార్క్రమ్ కూడా డకౌట్ అయ్యాడు. తాజా మ్యాచ్ లో అయినా కెప్టెన్ మార్ క్రమ్ ఈసారైనా జట్టును నడిపిస్తాడో లేదో చూడాలి. 13 కోట్లతో కొన్న హ్యారీ బ్రూక్ కూడా గత రెండు మ్యాచుల్లో రాణించలేక పోయాడు. అయితే తుది జట్టులోకి దక్షిణాఫ్రికా చెందిన ప్లేయర్ హెన్రిచ్ క్లాసెను ను తుది జట్టులో వచ్చే అవకాశాలున్నాయి. మరో వైపు గత రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఊపు మీదున్న పంజాబ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ఉన్నా పంజాబ్ ను ఢీకొట్టాలంటే.. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లోనైనా పుంజుకోక తప్పదు.

 

హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెఫ్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వీకెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఇంఫాక్ట్ ప్లేయర్ : కార్తిక్ త్యాగి లేదా అన్మోత్ ప్రీత్ సింగ్

 

రాత్రి 12.30 వరకు మెట్రో సేవలు

కాగా, ఉప్పల్ లో మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడుస్తుందని వెల్లడించారు. అయితే ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్ లో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. మ్యాచ్ కు 2 గంటల ముందు నుంచి ఉప్పల్ కు ఎక్కుమ మెట్రో సర్వీసులు తిరుగుతాయని తెలిపారు.

Exit mobile version