SRH VS RCB: సొంతగడ్డపై సన్ రైజర్స్ చివరి మ్యాచ్ కు సిద్దమైంది. మరోవైపు ఉప్పల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడితే.. ఇంటిముఖం పట్టడం ఖాయం. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.
కీలక పోరు.. (SRH VS RCB)
సొంతగడ్డపై సన్ రైజర్స్ చివరి మ్యాచ్ కు సిద్దమైంది. మరోవైపు ఉప్పల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడితే.. ఇంటిముఖం పట్టడం ఖాయం. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.
ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ చెత్త ప్రదర్శన చేసింది. ఇక సొంతమైదానంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది.
ప్రస్తుతం సన్ రైజర్స్.. 12 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.
అయితే ఈ మ్యాచ్ లో గెలుపు పెద్దగా హైదరాబాద్ ను ప్రభావితం చేయదు. కానీ బెంగళూరు భవితవ్యం మాత్రం సన్ రైజర్స్ పై ఆధారపడి ఉంది.
ఈ మ్యాచ్ లో డూప్లేసిస్ సేన ఓడిపోతే.. బెంగళూరు ఇంటికి వెళ్లడం ఖాయం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాలి.
గత మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడం.. ఆర్సీబీకి ప్లస్ పాయింట్ అయింది. ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి.
సన్ రైజర్స్ తో పాటు గుజరాత్ టైటాన్స్ తో జరిగే చివరి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంది.
సన్ రైజర్స్ రికార్డ్..
ఇక ఆర్సీబీ జట్టుపై సన్ రైజర్స్ రికార్డ్ ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్‌రైజర్స్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్‌రైజర్స్‌తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా ముగ్గురిపై మాత్రమే ఆధారపడి ఉంది.