SRH vs MI: ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ముంబయి జట్టులో కామెరున్ గ్రీన్ రాణించాడు. 40 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మంచి సహకారం అందించారు.
సన్ రైజర్స్ బౌలింగ్ లో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీసుకోగా.. నటరాజన్, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ముంబయి జట్టులో కామెరున్ గ్రీన్ రాణించాడు. 40 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మంచి సహకారం అందించారు.
సన్ రైజర్స్ బౌలింగ్ లో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీసుకోగా.. నటరాజన్, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ముంబయి నాలుగో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ ఔటయ్యాడు. 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు తిలక్ వర్మ.
15,16వ ఓవర్లలో భారీగా పరుగులు వచ్చాయి. 15 ఓవర్లో 21 పరుగులు రాగా.. 16 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. తిలక్ వర్మ ధాటిగా ఆడుతున్నాడు.
13వ ఓవర్ ముగిసేసరికి ముంబయి 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ, గ్రీన్ ఉన్నారు.
ముంబయి ఇండియన్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. జాన్సెన్ బౌలింగ్ లో సూర్య క్యాచ్ ఔట్ అయ్యాడు. సూర్య 3 బంతుల్లో 7 పరుగులు చేశాడు.
పవర్ ప్లే ముగిసేసరికి ముంబయి 53 పరుగులు చేసింది పవర్ ప్లే లో రోహిత్ శర్మ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గ్రీన్, ఇషన్ ఉన్నారు.
ముంబయి ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్ లో రోహిత్ క్యాచ్ ఔటయ్యాడు. 18 బంతుల్లో రోహిత్ 28 పరుగులు చేశాడు.
వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. మూడు ఓవర్లకు 28 పరుగులు చేసిన ముంబయి.
మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. చివరి బంతికి ఇషాన్ సిక్సర్ కొట్టాడు.
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిల్, ఇషన్ కిషాన్ ఉన్నారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్