Site icon Prime9

Sania Mirza : ఫ్యాన్స్ మధ్య టెన్నిస్ కి వీడ్కోలు పలకనున్న సానియా మీర్జా.. పలువురు ప్రముఖులు హాజరు

sania mirza playing last match in exhibition tennis match in hyderabad

sania mirza playing last match in exhibition tennis match in hyderabad

Sania Mirza : భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల కోసం హైదరాబాద్ వేదికగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. సానియా-రోహన్ బొప్పన్న టీమ్స్ తలపడ్డాయి. డబుల్స్ లో సానియా మీర్జా- బొప్పన్న జోడీ, ఇవాన్ డోర్నిక్- మ్యాటిక్ సాన్స్ జంటను ఢీ కొట్టింది. మొత్తం రెండు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సానియా చివరి సారి ఆడనున్న ఈ రెండు మ్యాచ్ లు చూసేందుకు పలువురు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. మ్యాచ్‌లు అన్నీ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్, డిన్నర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి భారత మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట తాను ఎక్కడ ప్రాక్టీస్ చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడబోతున్నానని సానియా మీర్జా అన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు తన కుటుంబం, స్నేహితులు వస్తున్నారని తెలిపారు. కెరియర్ లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆస్తక్తిగా ఎదురు చూస్తున్నానని సానియా అన్నారు. దేశ క్రీడా రంగంలో వ్యవస్థాగత మార్పులు వస్తేనే మరో సానియాను చూడగలమని భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా అభిప్రాయపడింది.

దేశంలో ముందుగా ఆ విధానం మారాలి : సానియా (Sania Mirza)

‘‘మరో సానియా రావడమంటే సవాలే. ఇప్పటికే నా లాంటి మరో క్రీడాకారిణి రావాల్సింది. దేశంలో ముందుగా విధానం మారాలి. అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలి. భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ప్లేయర్లంతా సవాళ్లను దాటుకుని వచ్చినవాళ్లే. ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయి. అమెరికాలో గొప్ప విధానముంది. నేను మార్పు కోరుకుంటున్నా. ఆ మార్పులో భాగమవాలనుకుంటున్నా. భవిష్యత్‌లో క్రీడా పాలనలోకి రావొచ్చేమో. దేశంలో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగిందంటే అందుకు అవసరమైన సౌకర్యాలు, శిక్షణ ఉండడమే కారణం. 20 ఏళ్ల తర్వాత కూడా మరో సానియా రాలేదంటే మాత్రం అది వైఫల్యమే.

దేశంలో క్రికెటర్లు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్‌ లాంటి లీగ్‌ ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. కానీ టెన్నిస్‌కు అలాంటి పరిస్థితి లేదు. నా కెరీర్‌లో ఒలింపిక్‌ పతకం లేకపోవడం లోటే. వింబుల్డన్‌ జూనియర్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత నాకు లభించిన స్వాగతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆటకు వీడ్కోలు పలకడానికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఆర్సీబీ మెంటార్‌గా కొత్త పాత్ర పోషిస్తున్నా. నాకు క్రికెట్‌తో సంబంధమేంటనే విమర్శలు వినిపించొచ్చు. కానీ గత 20 ఏళ్లుగా చేసినట్లే ఇప్పుడు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోను. డబ్ల్యూపీఎల్‌తో దేశంలో మహిళా క్రీడా రంగానికి మేలే. కోచ్‌గా మారతానో లేదో చెప్పలేను.

నా టెన్నిస్‌ అకాడమీల్లో ఎక్కువ సమయం గడుపుతా. ఎక్కడైతే ఆట మొదలెట్టానో అక్కడే ముగించబోతుండడం గొప్పగా ఉంది. ఆదివారం నాకు ప్రత్యేకమైంది. ఎల్బీ స్టేడియంలో చివరిగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడబోతున్నా. భావోద్వేగాలకు ఈ మ్యాచ్‌ వేదిక కానుంది’’ అని సానియా చెప్పింది. ఎన్నో ఒడుదొడుకులు దాటి విజేతగా నిలిచిన సానియా ఆడబోయే చివరి మ్యాచ్‌ తనకూ భావోద్వేగాన్ని కలిగిస్తోందని, బెదురులేని వ్యక్తిత్వం ఆమె సొంతమని బెతానీ పేర్కొంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ‘సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీ’ని సానియా మీర్జా ప్రారంభించింది. అందులో చాలా మంది పిల్లలు శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇకపై ఈ అకాడమీలో ఎక్కువ సమయం గడుపుతానని చెప్పుకొచ్చిన సానియా మీర్జా.. తాను టెన్నిస్ ఓనమాలు నేర్చుకున్న ఎల్బీ స్టేడియంలోనే కెరీర్‌ని ముగించబోతుండటంతో ఎమోషనల్ అయ్యింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version