Site icon Prime9

Sania Mirza : సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడనున్న సానియా మీర్జా.. ఎప్పుడు? ఎక్కడంటే??

sania mirza going to play last exhibition match in hyderabad

sania mirza going to play last exhibition match in hyderabad

Sania Mirza : హైదరాబాదీ భామ, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్‌లోనే సానియా – మాడిసన్ కీస్ జోడీ ఓటమి పాలైంది. తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని ఆమె అభిమానులు ఆశించినప్పటికీ ఓటమితో సానియా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో సానియా అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆ మ్యాచ్ లోనే సానియా కూడా ఎమోషనల్ అవ్వడం అందర్నీ ఒకింత బాధకు గురి చేసింది.

సానియా ముందు కానీ తర్వాత కానీ ఆమె సాధించిన విజయాలలో పదో వంతు కూడా మన దేశం నుంచి టెన్నిస్‌లో మరే అమ్మాయి సాధించలేదు. జూనియర్ వింబుల్డన్ టైటిల్ గెలవడంతో పాటు, డబ్ల్యుటిఏ టైటిల్ గెలిచిన ఏకైక భారతీయ మహిళా సానియానే. మొత్తం ఆరు గ్రాండ్ స్లాం టైటిల్స్ (డబుల్స్, మిక్సెడ్ డబుల్స్) ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆసియాడ్, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె మనకు పతకాలు సాధించిపెట్టింది. ఎలా చూసినా కూడా మన మహిళల టెన్నిస్ ముఖచిత్రం, చివరి పేజీ కూడా ఇప్పటికీ సానియా మీర్జానే. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని వేలాదిమంది ఆడపిల్లలు బుజ్జి బుజ్జి టెన్నిస్ రాకెట్లు పట్టుకుని కోచింగ్ సెంటర్ల వైపు పరుగెడుతున్నారు అంటే అది సానియా సాధించిన ఘనతే అని చెప్పాలి.

సొంత గడ్డపై చివరి మ్యాచ్ ఆడనున్న సానియా (Sania Mirza)..

దుబాయ్‌లో ప్రొఫెషనల్ కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన సానియా మీర్జా మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సొంత గడ్డపై మ్యాచ్ ఆడటం ద్వారా తన టెన్నిస్‌ కెరీర్‌కు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుందని సమాచారం అందుతుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో ఆటకు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. మార్చి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్ లలో ఆమె బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లలో సానియాతో పాటు గతంలో ఆమెతో కలిసి ఆడిన ఇవాన్ డోడిగ్, రోహన్ బోపన్న, కారా బ్లాక్, బెతానీ మాటెక్, మరియన్ బర్తోలి బరిలోకి దిగి అభిమానులను అలరించనున్నారు.

ఇందులో భాగంగా మార్చి 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళల డబుల్స్, మిక్స్‌డ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లను వీక్షించే అభిమానులు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర కనిష్టం రూ. 499, గరిష్టం రూ. 799 నిర్ణయించారు. పేటీఎంలో మ్యాచ్ టికెట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో సానియా మీర్జా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.

మొదటి మ్యాచ్ సానియా – బోపన్న, ఇవాన్ డోడిగ్ – బెథానీ, మాటెక్ – సాండ్స్ మధ్య మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్, రెండోది సానియా – బోపన్న, మరొకటి రోహన్ బోపన్న మధ్య రౌండర్ల మ్యాచ్. ఈ మ్యాచ్‌లు తిలకించి సానియాకు గ్రాండ్ వీడ్కోలు పలికేందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిసింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version