Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఏడాదిలో తాను టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. దుబాయి వేదికగా ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత తాను టెన్నిస్ కెరీర్ ను ముగించబోతున్నట్టు ప్రకటించింది. డబ్ల్యూటీఏ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా ఆడనుంది. మహిళల డబుల్స్ లో కజకిస్థాన్ ప్లేయర్ అన్నా డనిలీనాతో కలిసి బరిలో కి దిగనుంది. అంతర్జాతీయ కెరీర్ లో సానియా ఇదే చివరి గ్రాండ్ స్లామ్ కావడం విశేషం. ఈ గ్రాండ్ స్లామ్ అయిన తర్వాత దుబాయ్ లో చివరి టోర్నమెంట్ ఆడనుంది.
గత ఏడాది యూఎస్ ఓపెన్ తర్వాత రిటైర్మైంట్ తీసుకోవాలనుకున్న సానియా(Sania Mirza).. గాయాల కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ’ గాయాలతో కెరీర్ ను ముగించాలనుకోలేదు. ఏదైనా నాకు ఇష్టమైన రీతిలో చేయాలనుకుంటాను. అందుకే మళ్లీ ప్రాక్టీస్ చేశా‘ అని సానియా తెలిపింది.
డబుల్స్ లో మాజీ నెంబర్ వన్ అయిన 36 ఏళ్ల సానియా సింగిల్స్ కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో నిలిచింది. గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి ఇండియన్ అయిన సానియా ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించింది. కెరీర్‌లో ఇప్పటివరకు సానియా ఆరు డబుల్స్ గ్లాండ్ స్లామ్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news