RR vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివర్లో తబడింది. 20 ఓవర్లలో 189 పరుగులు చేసి.. 9 వికెట్లు కోల్పోయింది. మాక్స్ వెల్, డూప్లెసిస్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు.
రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చాహాల్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ క్యాచ్ ఔటయ్యాడు. హర్షల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజు 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. జైస్వాల్ క్యాచ్ ఔటయ్యాడు.
రాజస్థాన్ 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. విల్లీ బౌలింగ్ లో పడిక్కల్ క్యాచ్ ఔటయ్యాడు.
దేవదత్ పడిక్కల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.
రాజస్థాన్ 8 ఓవర్లకు 71 పరుగులు చేసింది. 8వ ఓవర్లో జైస్వాల్ ఓ సిక్స్, ఫోర్ తో రాణించాడు. క్రీజులో జైస్వాల్ తో పాటు.. పడిక్కల్ ఉన్నాడు.
పవర్ ప్లే లో రాజస్థాన్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు.
.
మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివర్లో తబడింది. 20 ఓవర్లలో 189 పరుగులు చేసి.. 9 వికెట్లు కోల్పోయింది. మాక్స్ వెల్, డూప్లెసిస్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు.
రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చాహాల్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
బెంగళూరు వరుస వికెట్లు కోల్పోతుంది. చాహల్ ఓవర్లో ఈ రెండు వికెట్లు పడ్డాయి. ప్రభుదేశార్ ను జైస్వాల్ రనౌట్ చేశాడు.
బెంగళూరు జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. లమ్రోర్ చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో మాక్స్ వెల్ క్యాచ్ ఔటయ్యాడు. మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు.
బెంగళూరు జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కళ్లు చెదిరే రీతిలో జైస్వాల్ డూప్లెసిస్ ను రనౌట్ చేశాడు. ఫాఫ్ 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు.
13ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డూప్లెసిస్, మాక్స్ వెల్ ఉన్నారు. ఇద్దరు అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు.
డూప్లెసిస్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
10 ఓవర్లకు బెంగళూరు 100 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో పాటు మాక్స్ వెల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు,5 ఫోర్లు ఉన్నాయి.
మాక్స్ వెల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు,5 ఫోర్లు ఉన్నాయి.
జేసన్ హోల్డన్ వేసిన ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి.
పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 62 పరుగులు చేసింది. డూప్లెసిస్, మాక్స్ వెల్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.
5ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 50 పరుగులు చేసింది. డూప్లేసిస్, మాక్స్ వెల్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
సందీప్ శర్మ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. డూప్లెసిస్ వరుసగా రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు.
నాలుగు ఓవర్లకు బెంగళూరు 38 పరుగులు చేసింది.
క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ వచ్చిరాగానే ఫోర్ కొట్టాడు.
బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో షాబాద్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది.
సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. డూప్లెసిస్ రెండు ఫోర్లు కొట్టాడు.
తొలి ఓవర్లో ఓ వికెట్ తో పాటు.. కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.
కోహ్లీ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఎల్ బీడబ్యూ గా వెనుదిరిగాడు.
టాస్ ఓడి బెంగళూరు బ్యాటింగ్ కి దిగింది. క్రీజులోకి కోహ్లీ, డూప్లెసిస్ వచ్చారు. ట్రెంట్ బౌల్డ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
విరాట్ కోహ్లి(కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయనుంది.