Site icon Prime9

Rahul Dravid: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పెంపు

Rahul Dravid

Rahul Dravid

 Rahul Dravid: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా (సీనియర్ పురుషులు) కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో రాహుల్ ద్రావిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మరియు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో సహా సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యుల ఒప్పందాలను కూడా బిసిసిఐ పొడిగించింది. ద్రావిడ్ కనీసం T20 ప్రపంచ కప్ 2024 వరకు కొనసాగుతారని భావిస్తున్నారు.

రెండేళ్ల కిందట ప్రధాన కోచ్‌గా..( Rahul Dravid)

రాహుల్ ద్రవిడ్ 2021 నవంబర్‌లో ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ద్రావిడ్ కోచింగ్ లో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మరియు వన్డే ప్రపంచ కప్ రెండింటిలోనూ భారతదేశం రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 తర్వాత రాహుల్ ద్రావిడ్‌తో బీసీసీఐ చర్చలు జరిపింది. పదవీకాలాన్ని కొనసాగించడానికి ఏకగ్రీవంగా అంగీకరించింది. భారతదేశ ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌కు మొదటి అసైన్‌మెంట్ దక్షిణాఫ్రికా పర్యటన. ఇది డిసెంబర్ 10న మూడు T20Iలు మరియు మూడు వన్డే ఇంటర్నేషనల్స్ తో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత సెంచూరియన్‌లో (డిసెంబర్ 26 నుండి) మరియు కేప్ టౌన్‌లో (జనవరి 3 నుండి) రెండు టెస్టులు ఆడతారు. ఆ తర్వాత జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇలా ఉండగా ప్రధాన కోచ్ గా తన పొడిగింపుపై రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ టీమ్ ఇండియాతో గత రెండేళ్ల తన ప్రయాణం పూర్తిగా చిరస్మరణీయమైనదని తెలిపాడు. మేము ఎన్నో ఎత్తు పల్లాలను చూసాము. అయితే నాకు లభించిన మద్దతు మరియు స్నేహం అసాధారణంగా ఉన్నాయని తెలిపారు.

Exit mobile version