MI vs LSG: ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్ లో చెన్నై విజయం సాధించగా.. క్వాలిఫయర్ 2 కి మరోసారి చెపాక్ స్టేడియం వేదికైంది. ఈ క్వాలిఫయర్ 2 లో లక్నోతో, ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. గుజరాత్ తో పోటి పడాల్సి ఉంటుంది. ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కీలక పోరు.. (MI vs LSG)
ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్ లో చెన్నై విజయం సాధించగా.. క్వాలిఫయర్ 2 కి మరోసారి చెపాక్ స్టేడియం వేదికైంది.
ఈ క్వాలిఫయర్ 2 లో లక్నోతో, ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. గుజరాత్ తో పోటి పడాల్సి ఉంటుంది.
ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
లక్నోతో జరిగే మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుంది.
స్పిన్నర్ కార్తీకేయ స్థానంలో మరో యువ స్పిన్నర్ హృతిక్ షోకీన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా తిలక్ వర్మను తీసుకుంటున్నట్లు సమాచారం.
ముంబయి విధ్వంసకర బ్యాటింగ్ ముందు.. లక్నోకు గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ముంబయి బౌలింగ్ కాస్త ఇబ్బంది పడుతుంది.
లక్నో జట్టులో మార్పులు..
ముంబయితో జరిగే మ్యాచ్ లో లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. గత రెండు మ్యాచ్‌ల్లో లక్నోకు ఓపెనింగ్ ప్రధాన సమస్యగా ఉంది.
కాబట్టి ఈ కీలకమైన మ్యాచ్‌కు విధ్వంసకర ఓపెనర్ కైల్ మైర్స్‌ను తిరిగి తీసుకు రావాలని లక్నో మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
మైర్స్ జట్టులోకి వస్తే.. పేసర్ నవీన్ ఉల్ హక్ బెంచ్‌కే పరిమితం కావల్సి వస్తుంది. అదే విధంగా కరణ్ శర్మ స్థానంలో పేసర్ యష్‌ఠాకూర్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎవరిది పైచేయి..
లక్నో ఈ సీజన్ లో అద్భుతంగా రాణించింది. కేవలం కొందరిపై ఆధారపడకుండా.. సమిష్టిగా రాణిస్తూ ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి దూసుకెళ్లింది.
దీంతో లక్నోకే విజయవకాశాలు అధికంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కెప్టెన్ దూరం కావడంతో.. జట్టు బాధ్యతలను కృనాల్ పాండ్యా మోస్తున్నాడు.
లక్నోకు ఆల్ రౌండర్లు ప్రధాన బలం. ఇక ముంబై విషయానికొస్తే.. రోహిత్ సేనలో నాణ్యమైన బౌలర్లు లేనప్పటికీ, వారు పటిష్టమైన బ్యాటింగ్ విభాగంతో మ్యాచ్‌లు గెలిచారు.