Prime9

P.T.Usha: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష ఏకగ్రీవం

P.T.Usha: భారతదేశపు దిగ్గజ అథ్లెట్‌, పరుగుల రాణి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు పీటీ ఉష. ఈ స్టార్ క్రీడాకారిణి మరో అరుదైన ఘనతను సాధించారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానితో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష రికార్డుకెక్కారు. అంతేకాకుండా మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌గా కూడా ఆమెకు ఘనత దక్కింది.

Image

ఈ ఎన్నికల్లో ఉషకు పోటీగా ఎవరూ నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా జూనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీకి పీటీ ఉష ఛైర్‌‌ పర్సన్‌‌గా ఉన్నారు.

Image

కాగా, 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతోపాటు 23 పతకాలు గెలుచుకుంది.

ఇదీ చదవండి: ఫిఫా ప్రపంచకప్ లో మెరిసిన మెస్సీ.. సూపర్ గోల్స్ తో సెమీస్ చేరిన అర్జెంటీనా..!

Exit mobile version
Skip to toolbar