MS Dhoni: నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. తద్వారా ఐపీఎల్ సీజన్ 16 లో తొలి విజయన్న నమోదు చేసింది. సోమవారం చెన్నై లోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో లక్నో ను ఓడించింది. అంతకుముందు టాస్ గెలిచిన లక్నో.. చెన్నై ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లో చెన్నై 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేషించింది. ఓపెనర్ గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ రెండో మ్యాచ్లోనూ విజృంభించాడు. అతడికి తోడుగా డెవాన్ కాన్వే కూడా రాణించాడు. బౌలర్లలో మొయిన్ అలీ స్పిన్ మాయజాలంతో చెన్నై విజయం ఖరారైంది.
ధోని మరో రికార్డు(MS Dhoni)
కాగా, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో 5 వేల పరుగుల ఘనతను ధోని నమోదు చేసుకున్నాడు. లక్నోతో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. బ్యాక్ టూ బ్యాక్ రెండు సిక్స్ లు కొట్టి మూడో బంతికి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఆ 12 పరుగులతో ధోని 5వేల రన్స్ క్లబ్ లో చేరిపోయాడు. ఇంతకు ముందు ఈ ఘనతను విరాట్ కోహ్లి(6706), ధావన్(6284), డేవిడ్ వార్నర్ (5937), రోహిత్ (5880), రైనా (5528), డివిలియర్స్ (5162) లు సాధించారు.
The long awaited glimpse of Thala! 🚁#CSKvLSG #WhistlePodu #Yellove 🦁💛pic.twitter.com/m96Ybqhm6a
— Chennai Super Kings (@ChennaiIPL) April 3, 2023
హోరెత్తిన చెపాక్
దాదాపు నాలుగేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సొంత గ్రౌండ్ లో బరిలోకి దిగింది. దీంతో స్టేడియం అంతా చెన్నై అభిమానులతో పోటెత్తింది. చెన్నై బ్యాటర్లు కూడా అదే రేంజ్ లో దంచికొట్టారు. మరో వైపు ధోని కూడా బ్యాటింగ్ కు దిగడంతో స్టేడియం లో ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ధోని చివరి ఓవర్లలో బ్యాటింగ్ వచ్చాడు. ఆ సందర్భంగా చెపాక్ స్టేడయంలో ఫ్యాన్స్ అంతా మొబైల్ లైట్స్ ఆన్ చేసి అతనికి సపోర్ట్ చేశారు. ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్ల తో అభిమానులకు ఆకట్టుకున్నాడు. మరో వైపు ధోని ఆడుతున్నప్పుడు జియో సినిమా లో మ్యాచ్ ను 1.7 కోట్ల మంది వీక్షించారు. ఐపీఎల్ 16 సీజన్ లో ఇది ఓ రికార్డు కావడం విశేషం.